Sunday, July 23, 2017

!!పట్టుదల!!

నాలోని ఆత్మబలం నిదురలేచిందేమో
నా అహంభావం కనురెప్పలు కదుపుతూ 
అహంకారపు గుండె తలుపు తడుతూ
సమస్త శక్తులను ధీమాతో కూడదీసుకుని 
శ్రమకు ఆతిధ్యమిచ్చి ఆలింగనం చేసుకుని
నమ్మకంగా నాతో నేను అనుకున్నాను..
అందరిలా బ్రతికితే ఔనత్యం ఏముంది
నలుగురికీ ఆదర్శమైతే ఔదార్యముంది
అందుకే దృఢసంకల్పంతో నిర్ధారించుకున్నాను 
వైఫల్యాలు ఎన్ని ఎదురైనా విధి ఎంత వక్రించినా 
ఊపిరి ఉన్నంత వరకూ లక్ష్యసాధనకు కృషిచేస్తాను!

3 comments:

  1. స్పూర్తిని ఇచ్చే పోస్ట్.

    ReplyDelete
  2. ఆత్మబలం అదేనేమో మీకు.

    ReplyDelete
  3. మీరు సాధిస్తారు.

    ReplyDelete