గోడలకు పగుళ్ళు
పడితే గోడ కూలిపోతుంది
బంధాలు బీటలైతే అదే
అడ్డుగోడ అవుతుంది
వందసార్లు మంచి చేసి
నీవొక్కసారి తప్పుచేస్తే
వందసార్లు నీవు
చేసిన మంచిని మరచిపోయి
నీవొక్కసారి చేసిన
తప్పునే ఎత్తి చూపుతుంది
లేనిదేమో కావాలని
ఉన్నది వద్దు అనిపిస్తుంది
మొహమాటానికి పోయి మన
సంతోషాలని వీడి
ఎదుటివారికి
దానంచేస్తే విషాదం మిగులుతుంది
ప్రయత్నం పట్టు
విడిస్తే అది నిన్ను వదిలేస్తుంది
మనల్ని మాయ చేసే
మనసుని అదుపు చేస్తే
జీవితం పై గెలుపు
సాధించాము అనిపిస్తుంది!
అధ్భుతంగా రాశారు జీవిత సత్యాలను.
ReplyDeleteInspiring the situations.
ReplyDeleteప్రేరణాత్మకం ప్రతీ పోస్ట్
ReplyDelete