Thursday, November 23, 2017

!!మరో ప్రయత్నం!!

ఆలోచిస్తూ నడుస్తున్నానని తెలిసిన నా అడుగులు
పగిలిన పాదాలకు మంచు లేపనం పూస్తున్నాయి!

అలజడ్ళతో చెమటపట్టిన తనువును తల్లడిల్లవద్దని
సేద తీర్చేలా గాలితెమ్మెరలు వీవనలై వీస్తున్నాయి!

ఆవేశంతో హృదయం ఎగసిపడుతుంటే హాయిగొల్పేలా
కోయిలలు కమ్మగకూసి మదికి జోలపాడుతున్నాయి!

ఆశలు నిద్రపోతున్న నాలో కలగా రూపాంతరం చెంది
స్ఫూర్తిని ఇచ్చే ఉదయకిరణాలు మేల్కొల్పుతున్నాయి!

అణచి వేయబడిన కోరికలు బద్దకం వీడి రెక్కలు విప్పి
రివ్వుమంటూ మరో ప్రయత్నం వైపు సాగుతున్నాయి!

7 comments:

  1. మరో ప్రయత్నం విజయం వైపుకే సాగండి.

    ReplyDelete
  2. అణచి వేయబడిన కోరికలు బద్దకం వీడి

    ReplyDelete
  3. మీ అడుగులు ఎప్పుడూ విజయం వైపునే పయనిస్తాయి.

    ReplyDelete
  4. ప్రయత్నించడం
    ఓడిపోతే మరో ప్రయత్నం తప్పదుగా..

    ReplyDelete
  5. గెలిచే వరకు ప్రయత్నించాలి...మంచి కవితను అందించారు.

    ReplyDelete
  6. బాగుందమ్మా. నీవు బుచికి తవికలు రాయడం కొందరు తవికస్వాములు పొగడటం. తనివితీరా ఆనందించండి.

    ReplyDelete