బ్రతికినంతకాలం కుదురుగా ఉండాలని
సరైన ప్రణాలికలే వేసానని సంతోషించి
సంసార సముద్రంలోని సారాన్ని వెతికి
సవ్యంగా తీరం చేరాలని ప్రయత్నించకు!
జీవితనౌకని తెగింపు తెడ్డుతో నడుపుతూ
అంతరంగ ఆలోచనలకి ఆనకట్టలే వేసినా
ఈతకొట్టి అలసట తప్ప అంతముండదు
బ్రతుకు తీపి బంధాలకు హద్దులుండవు!
బ్రతుకు భారం దింపుకునే ఉబలాటంలో
ఉత్సాహం అరువు తెచ్చుకుని బెంగపడి
అనవసరమైన అనుభవాలకు విలువనిచ్చి
భాధ్యతలను పెంచేసుకుని బెంబేలుపడకు!
అస్థిరమైన మంచీచెడ్ల కాలాలని బంధించి
కుడుటపడని మనసును ఇబ్బంది పెడుతూ
విచారాలకు వేదనల్ని వలువలుగా చుట్టినా
కష్టాల కన్నీళ్ళు ఎన్ని కార్చినా ఫలించవు!
జీవిత సత్యాలు
ReplyDeleteప్రయత్నం చేయనిదే వృధాప్రయాస అనే విషయం భోదపడదు.
ReplyDeleteఅస్థిరమైన మంచీచెడులు కాలాన్ని బంధించడం బాగుంది.
ReplyDeleteబ్రతుకు గురించి చక్కగా వ్రాసారు.
ReplyDeleteNice
ReplyDelete