ప్రేమా ప్రేమాని ప్రేమకోసం ప్రాకులాడి
ఎవరినో ప్రేమిస్తే ఒరిగేదేం ఉండదని..
నన్ను నేను ప్రేమించుకుంటున్నాను!
అన్నీ తెలుసు అనుకుని అజ్ఞానంతో
పరులను పరిహసించడం పాపమని..
నా అవగాహనని పరిహసించుకున్నాను!
అవివేకినై ఎవరిలోనో ఆశయాలు వెతికి
అబాసుపాలై ఆవేదన చెందడం ఏలని..
కలలతో కావలసినంత శృంగారం చేసాను!
ఢాబూ దర్పం దర్జాలకై శ్రమించడం రాక
నీడతోనూ నిరాశ ఎదురై అత్యాశేనని..
సాధారణ సరళతను కౌగిలించుకున్నాను!
అనవసరంగా ఏవో ఊహించి ఊహల్లో తేలి
అవినీతిని ఆశ్రయించని నిస్సహాయతని తిట్టి
నిజాయితీని పెళ్ళాడి అహానికి విడాకులు ఇచ్చాను!
నిజాయితీని పెళ్ళాడి అహానికి విడాకులు ఇచ్చాను చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అద్భుతం.
ReplyDeleteనీడతోను నిరాశ ఎదురైతే
ReplyDeleteఅలసిన చిరు మదికి ఆలంబన ఏది..?
నిజాయితీ
ReplyDelete