జీవన పయనంలో అనునిత్యం సంగ్రామమేనేమో
తీరని కోర్కెలు కోరలు తెరచి బుసకొడుతున్నట్లు
ఓపిక నశించి రౌద్రం తాండవిస్తూ రణానికి సిద్ధం...
మాటా మాటా కలగలిసి కూడా క్షతగాత్రమైపోతూ
వయసేమో రెక్కలు తెగిన పక్షిలా అరుస్తున్నట్లు
ఆత్మగౌరవపు గోడకతుక్కున్న సాంప్రదాయవ్యర్థం...
ఆవేదన ఆరాటంతో కరిగిపోతున్న ఆశయాల ఆకృతితో
ఆత్మాభిమానం అంచనాకందని భీభత్సం సృష్టిస్తూ
ముక్కలై రాలిపడిపోతున్న గతస్మృతుల యుద్ధం...
ముక్తాయింపులు మాట్లాడుకుంటున్న అనుబంధాల్లో
మనసుల మధ్య మమకార కారుణ్యం కరువైపోయినట్లు
సివంగిలా పైకి నవ్వుతూ లోన దహిస్తున్న నా రూపం!!
జీవిత రణం మీ అక్షరాల్లో నిత్య సత్యం.
ReplyDelete