రోజులు వారాలుగా వారాలు నెలలై ఏళ్ళు గడుస్తుంటే
నేను ఎందుకు మారకూడదనుకుని మారిపోతున్నాను!
అవును తల్లిదండ్రుల్ని అక్కాచెల్లెళ్ళను అన్నాతమ్ముల్ని
నా అనుకున్న వారిని అందరినీ ప్రేమించి కళ్ళుతెరిచి
ఎవరికెవరూ కారని నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను
ఎవ్వరినీ మార్చలేక నన్ను నేను మార్చుకుంటున్నాను!
ఇప్పుడు నేను కూరగాయలు పండ్లు అమ్ముకునే వారితో
బేరసారాలు చేసి మిగిల్చిన సొమ్ముతో భవంతిని కట్టలేను
ఆ సొమ్ము పేదవాడి పిల్ల స్కూల్ ఫీజ్ ఐతే బాగుండును
ఆటోలో నుండి దిగి డబ్బులిచ్చి చిల్లరడగడం మానేసాను
అదే చిల్లర డ్రైవర్ పెదవుల పై నవ్వైతే ఆనందిస్తున్నాను!
నేనిప్పుడు ఒంటిపై బట్ట నలిగిపోయిందని బాధపడ్డంలేదు
వ్యక్తిత్వమే మనకన్నా బిగ్గరగా మాట్లాడుతుందని తెలుసు
ఎందరి చేతనో మెప్పులు ప్రశంసలు ప్రేరణగా పొందిన నేను
స్వేచ్ఛగా ఉదారంగా నేనిప్పుడు ఎందరినో ప్రశంసిస్తున్నాను
నాకు విలువనీయని వారి నుండి నేను దూరమైపోతున్నాను
నా విలువ తెలియకపోయినా నేను వారిని తెలుసుకున్నాను!
అవును నిజంగానే నాలో చాలా మార్పు వచ్చినట్లనిపిస్తుంది
పనికిరాని ప్రసంగం చేయక కుళ్ళూ కుతంత్రాలని వెలివేసాను
ఏ అనుబంధానికైనా అహమేగా అడ్డని పూర్తిగా అణచివేసాను
నావలన జరిగిన తప్పుకి క్షమార్పణ కోరడం నేర్చుకున్నాను
భావోద్వేగాలతో నేను ఇబ్బందిపడి వేరెవరినీ ఇబ్బంది పెట్టను
నేను సృష్టించినవైన భావోద్వేగాలు నన్ను నిర్దేసిస్తే ఊరుకోను
నా ప్రతీరోజు చివరిరోజనుకుని జీవించడం అలవరచుకున్నాను
ప్రస్తుతానికి ఇంతే మారాను మున్ముందు ఎంతో మారిపోతాను!
జీవిత ధృఢ సంకల్పం నెరవేర్చే ప్రక్రియలో ఇటువంటి ఎత్తుపల్లాలు తప్పవు. మీ మార్పు మీకు ఆనదాన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteGood post
ReplyDeleteసృష్టించిన భావోద్వేగాలు అద్భుతం
ReplyDeleteఆత్మీయులు, స్నేహితులని నమ్మి ఎలా ఫూల్ అయ్యావోతలుచుకుని మరీ నవ్వు
ReplyDeleteఎన్నో విపత్తులలో భయపడ్డ సంఘటనలు గుర్తుచేసుకుని నవ్వు..ఇలా సాగిపోవడమే జీవితం అని చెప్పి నవ్వు.