Friday, March 8, 2019

!!నేనే ఆధారం!!

నా కళ్ళతో కాదు నీ మనసుతో చూడు కనబడతాను
కరుణ దయ రక్షణ సంరక్షణనే పేర్లతో పిలవబడతాను 
నీ జీవితంలో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచేది నేను
మనసుని చల్లపరచి ఉధ్రేకాన్ని నీరులా మారుస్తాను..

శ్రమతో అలసిన నరాల్లో కొత్త రక్తానినై ప్రవహిస్తాను   
చీకటిలో కొట్టుమిట్టాడు జీవితంలో వెలుగు నింపుతాను!

మనసుపెట్టి చూడు...ప్రతి మగువా ప్రతి రూపంలోనూ
తల్లి చెల్లి కుమార్తె స్నేహితురాలు భార్య ప్రియురాలే కాక
ఉపాధ్యాయురాలిగా భోధించి అవసరమైతే దండిస్తాను!!

సుచితో ప్రవహించే నీరులా పరిస్థితికనుగుణంగా మర్లుతాను
నేను లేనిది జీవితం తీరని దాహం ఇంకా అసంపూర్ణం..
ఈ సృష్టికి నేనే మూలం...సంతృప్తికర జీవనానికి ఆధారం!

4 comments:

  1. అన్నీ కలగలసిన మహోన్నత మహిళా నీకు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  2. Replies
    1. ఏమి అద్భుతం శ్రాద్ధం అద్భుతం.

      Delete
  3. Incredible points. Sound arguments. Keep up the great work. Read vastu tips by our famous Vastu consultant in Delhi

    ReplyDelete