జీవితంలో కొందరు మనతో ఉండి,మనతో పోరాడతారు
మోసం చేయాలని ముంచి తొక్కేస్తారు..
ఇతరులతో పోల్చి వెటకరించి అవమాన పరుస్తారు
ఎదుగుదలను ఓర్వలేక ద్రోహంచేస్తారు!!
వెన్నుపోటు పొడిచి నటిస్తూ తక్కువ చేసి మాట్లాడతారు
బలంకన్నా బలహీనతల గురించే చాటింపు వేస్తారు
జాలి చూపిస్తున్నట్లు ఉంటూ డబ్బుతో పోలుస్తారు
మనం నష్టపోతే సంతోషపడి డప్పుకొట్టి చాప్టర్ క్లోజ్ అంటారు
చేతకానిది ఎందుకు చేయాలి, అలా కావల్సిందే అంటారు
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలు..
ఎన్నో సంఘటనల మధ్య నుండి జీవితం దూసుకుపోతుంది
మనం వారి మాటలు విని అక్కడే ఆగితే గమ్యం చేరలేం!!
చావో..రేవో మనతో మన లక్ష్యం సాగాలి
వారి గురించి సమయం వృధా చేసి, ఆలోచించ కూడదు
మన ప్రయాణంలో వాళ్ళు గడ్డి పరకలతో సమానం
ఇలా ఎందరో వస్తారు పోతారు....మన ప్రయాణం మనదే!
ఎందుకంటే.."ఈ జీవితం మనది వారిది కాదు"
జీవితంలో జరిగేటి సత్యాలను అక్షరాల్లో వ్రాసారు మాడం.
ReplyDeleteExcellent saying.
ReplyDeleteమనమూ మనుషులమే!!
ReplyDelete---------------
గుర్రాల కళ్ళకు గంతలుంటాయ్
ఎధ్దుల నోళ్ళకు సిక్కేలుంటాయ్
వాటిని నడిపించే వాళ్ళచేతుల్లో కళ్ళేలుంటాయ్
కాని.......
తెలివైనమనిషికి లక్ష్యముంటుంది
సాధించగలిగేందుకు దీక్ష వుంటుంది
చివరికీ విజయం సాధ్యమౌతుంది
గాదిరాజు మధుసూదనరాజు