ఆమెను మీరే కులమని ఒక తెలివైన అబ్బాయి అడిగిన ప్రశ్నకు..
అమ్మగా చెప్పనా లేక అమ్మాయిగా చెప్పనాని పక్కున నవ్విందామె!
అహా..ఆ రెంటిలోని ఆంతర్యమేమని ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టగా
ఆమె చెప్పడం ప్రారంభించింది----
ఆత్మవిశ్వాసంతో మరో జన్మనెత్తి తల్లినైనప్పుడు "కులరహితనే" నేను!!
తల్లిగా బిడ్డ మలమూత్రాలను శుభ్రపరిచినప్పుడు "శూద్ర" జాతి నాది..
శిశువుకు అన్నింటా రక్షణ కల్పించే ప్రక్రియలో "క్షత్రియ" కులం నాది..
పిల్లల్ని పెంచటంతోపాటు నాకులం కూడా మారిపోతుంది...అదెలాగంటావా!
మంచి సంస్కృతి, విలువలు ప్రవర్తన నేర్పేటప్పుడు "బ్రాహ్మణ" జాతి నాది..
సంపాదనలో పొదుపు ఖర్చుల గురించి మార్గనిర్దేశం చేసే "వైశ్య" కులం నాది..
సమాధానం చదివి కూడా ఏ కులమని ఎవరైనా అడిగితే
"అమ్మకు కులమే లేదంది"
మరి మతాల పై మీ అభిప్రాయం ఏమిటన్నాడు ఆ అబ్బాయి..
"మతలబుతో బ్రతుకుతూ మట్టిలో కలిసే మనకు మతాల గురించి మాట్లాడే హక్కే లేదంది"
No comments:
Post a Comment