యవ్వనంతో మిడిసిపడకు రేపు చింతిస్తావు
ఉదయించే సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తాడు
కొన్నాళ్ళు కొనసాగే జీవిత బాటసారివి నువ్వు
రిక్తహస్తాలతో ఏడుస్తూ వచ్చి ఏడిపించి పోతావు
మూడునాళ్ళ ముచ్చటేనని తెలిసి మురుస్తావు
జీవితాన్ని చూసి ఏడుస్తాడు జీవితం తెలిసినోడు
అనవసరంగా ఆలోచించి ఆందోళన చెందే నువ్వు
అన్నీ తెలిసి కూడా ఎందుకనో ప్రాకులాడుతావు
గర్వంతో తలెత్తి నడిచావో తలకు బొప్పికడతావు
చావు నుండి ఎవరైనా ఎంతని తప్పించుకోగలరు
సమాధియే చివరి గమ్యం చెప్పకుండా పాతేస్తారు
ఓహ్ గుండే..ఉన్నంత వరకూ హాయిగా ఉండు!
జీవిత సత్యాలు వెల్లడించారు.
ReplyDeleteWell said madam
ReplyDeleteఅంతేగా.. జీవతమంటే అంతేగా
ReplyDeleteGreat to see here.
ReplyDeleteJust amazing style