Thursday, November 18, 2021
!!విలువ!!
Wednesday, November 3, 2021
!!అనుకుంది చేసెయ్!!
మంచిగా అనిపించిన పనిని చేసేయ్ అంతే
తెలిసో తెలియకో తప్పుచేసి తెలుసుకుంటే
క్షమార్పణ కోరటం తలవంచినట్లు ఏంకాదు
ఎవరివల్లైనా బాధకలిగితే వారికి తెలియాలి
చెప్పాలి అనుకున్నది చెప్పి పడేయ్ అంతే
నీవలన ఏదైనా తప్పు జరిగినా బాధపడినా
మన్నించమని వేడికో అదేం చిన్నతనం కాదు
నలుగురితో కలిసినవ్వే సమయం వచ్చిందంటే
సంకోచించక మనసు విప్పి నవ్వేసేయ్ అంతే
ఎవరైనా బాధపడుతూ వారి కంటనీరు చూస్తే
అక్కున చేర్చుకుని ఓదార్చు తప్పు ఏంలేదు
పలుమార్లు అబద్ధాలు చెబితే అద్దాన్ని చూపు
ఎదగడానికి అవసరమైతే ముందడుగేయ్ అంతే
ఎవరైనా నిన్ను వదిలి వెళుతున్నామని అంటే
వీడ్కోలు చెప్పి వీపు నిమురు చేసేది ఏమీలేదు
Wednesday, October 13, 2021
!!అన్నిట్లో ఆనందం!!
Tuesday, September 21, 2021
Thursday, September 16, 2021
!!సమయానుసారం!!
Tuesday, July 27, 2021
ELATED IN EUROPE/యూరప్ ట్రిప్
Europe trip...16th-26th July 2016 (All Indian Medical Association) విమానం మిలన్(Milan) ఎయిర్ పోర్ట్ లో దిగింది మొదలు అల్పాహారం అన్ని హోటల్స్లో అతిగా ఆరగించామనే చెప్పాలి. ఇటలీ(Italy) వినైస్(Venice) ద్వీపంలో విహారయాత్రకి ముందు విందుభోజనం మొదలుకుని పదిరోజులు సుష్టిగా టైంకి భోజనానికి ఏమాత్రం లోటు జరుగలేదు అని చెప్పడానికి పెరిగిన మా బరువులే నిదర్శనం. చెప్పడం మరిచానండి...వినైస్ లో బోటు షికారు బాగుంది. ఫ్లోరెన్స్(Florence) నుండి బయలుదేరి రోం(Rome) నగర రోడ్లపై వాటికన్(Vatican) సిటీ అందాలను గాంచి పిసా(Pisa) టవర్ పైకి ఎక్కకనే పై మెరుగులు చూసి పయనించాము. బ్లాక్ ఫారెస్ట్, జర్మనీ(Germany)లో సుధీర్ఘ ప్రయాణం తరువాత టిట్లిస్(Titlis) మంచుపర్వత అందాలతో మనసు ఘనీభవించింది. స్విజర్లాండ్(Switzerland)లో మూడురోజులు ఉన్నా ఇంకా ఉండాలనిపించే ప్రకృతి అందాలు దానికే సొంతం. అయినా తప్పని పయనం కదా...డిజాన్(Dijon) వీధులగుండా పారిస్(Paris)కి పయనం. ఫ్రాన్స్(France) పాష్ హోటల్ నోవాటెల్ లో మకాం. రెండురోజులు పారిస్ నగర అందాలు, ఈఫెల్(Eiffel) టవర్ ఎక్కిన ఆనందాలని మూట గట్టుకుని బెల్జియం(Belgium)కి పయనం. బ్రుసెల్స్(Brussels)లో కట్టడాలు చూసిన పిమ్మట నెదర్లాండ్స్(Netherlands) ఆంస్టెర్డాం(Amsterdam)కు చేరుకుని మరునాడు మడురొడం(Madurodam) పార్క్ చూసి ఫాంక్ఫర్ట్(Frankfurt) ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కి హైదరాబాద్(Hyderabad) చేరుకోవడంతో యూరప్(Europe) టూర్ ముగిసింది.
Wednesday, July 7, 2021
!!నువ్వే ప్రత్యేకం!!
నీ లోపాలు తెలుపడానికి జనం ఉన్నారుగా
ఆశయాలను కలలను ఎత్తుగా ఊహించుకో
అవమానించి క్రిందకు లాగే లోకులున్నారుగా
జీవితం సాగాలంటే అడుగు ముందుకువేయి
వెనక్కి లాగడానికి బోలెడుమంది ఉన్నారుగా
నీ అభిరుచికి అనువైన ఆజ్యం నువ్వే పోసుకో
నిన్ను రగిలించి మండించ ప్రజలు ఉన్నారుగా
ఉండాలి అనుకుంటే మధురజ్ఞాపకమై మిగిలిపో
నిందలేసి పుకారుపుట్టించే మానవులున్నారుగా
ప్రేమించాలనుకుంటే నిన్ను నువ్వు ప్రేమించుకో
ద్వేషించడానికి దునియా మొత్తం వేచిఉన్నదిగా
నిన్ను నువ్వు నమ్ముకుని ఏదైనా సాధించుకో
సందేహించి నిరుత్సాహ పరిచే వ్యక్తులున్నారుగా
ప్రత్యేకమైన గుర్తింపు సృష్టించుకుని అలాసాగిపో
మందలా ముందుకు సాగిపోయే గుంపు ఉందిగా
Wednesday, June 30, 2021
!!ఆల్ హ్యాపీస్!!
Thursday, April 29, 2021
!!భయపెడుతూ!!
లోలోపల నేను ఆత్మగౌరవపోరాటం చేస్తుంటాను!
కపటంలేకుండా దాచక ఉన్నది చెప్పేస్తా కానీ..
కరకుస్వరమే నాచుట్టూ కంచైందని తెలుపలేను!
అందరూ మెచ్చే చరిత్రను సృష్టించలేను కానీ..
ఎవ్వరూ చెయ్యెత్తి చూపి చెప్పే ఆస్కారమివ్వను!
మనస్ఫూర్తిగా చెయ్యాలనుకున్నది చేస్తా కానీ..
తిరిగి ఆశించరాదంటూనే అనురాగాన్ని ఆశిస్తాను!
ఎల్లలెన్ని ఎగసిపడ్డా పిడికిలెత్తి ప్రోత్సహిస్తా కానీ..
ఫిరంగినై మాటల తూటాలు పేల్చి నొప్పించలేను!
బానిసత్వ బంధాలపై బంధూక్ పెట్టలేను కానీ..
భయపెట్టే అంటరాని ఆయుధంగా మిగిలిపోతాను!
Wednesday, April 21, 2021
!!నా మనిషి!!
నన్ను ఉన్నతస్థాయిలో ఊహించి
నన్ను నన్నుగా ఇష్టాపడే వారిలో...
నాకు కనిపించేది పరమ ఆప్తుడే తప్ప
ఈర్ష్య ధ్వేషాలతో రగిలే మనిషి కాదు!
నా భావావేశాల్లో కేవలం ఆగ్రహం చూసి
నా నిస్సహాయతను గమనించి
నన్ను అంచనా వేసే వారిలో...
నాకు కనపడేది వాదం స్వార్థం తప్ప
నన్నర్థం చేసుకున్న మనిషిని కాదు!
Monday, April 12, 2021
!!మారిచూడు!!
వేషధారణలో కాదు గుణగణాల్లో మార్పు చూడు..
ముఖంపై నవ్వుతో కంట నీరు రాకుండా రోధించు
నాలా రాత్రిళ్ళు నిదురపోకుండానే తెల్లవారిపోనీయి
నీతోడుగా లేనివారికి నీ సమయాన్ని కేటాయించు
కాలంతోపాటు కరిగే వారికి నీ ఊపిరి ఇచ్చి చూడు
నీదగ్గర ఉన్నవన్నీ కోల్పోయి కూడా నవ్వుతుండు
నన్ను అర్థం చేసుకోవాలంటే నువ్వు నాలా మారు
అంతేకానీ నా స్థితిగతుల్ని చూసి కుళ్ళి చితికిపోకు
దాని వెనుక దాగిన శ్రమ కష్టనష్టాల జాబితా చూడు
పోల్చిచూడు పొరపచ్చాల్లేని నా ప్రేమను నీ ప్రేమతో
ఆస్తి అంతస్తుల్లో కాదు జ్ఞాన సంపదలో ఎదిగి చూడు