ఒకరోజు నేను హాస్పిటల్ కి వెళుతుంటే దారిలో "గుడ్ మార్నింగ్ మాడం" అంటూ ఆరడుగుల అందగాడు కాస్త మాసిన గెడ్డంతో నన్ను పలుకరించాడు.అది మొదలు రోజూ హాస్పిటల్ వరకు నా వెనుక, ఇంటికి వెళ్ళేటప్పుడు నా ముందు రావడం దినచర్యగా మారింది. అడుగుదాము ఎందుకు ఇలా రోజూ వెంటపడుతున్నావు అనుకున్నా కాని....అమ్మో! అన్నేమో మనల్ని ఏమీ అనడంలేదుకదా అని ఊరుకున్నా. ఇలా రెండు వారాలు గడిచాయి. ఆరోజు అతను నాకు కనపడలేదు నిజం చెప్పాలంటే నా కళ్ళుకూడా ఏమైంది ఈరోజు రాలేదు అని వెతికాయనుకోండి....
హాస్పిటల్ లో అడుగు పెట్టగానే ఎదురుగుండా ఆ కుర్రాడు "గుడ్ మార్నింగ్" అంటూ నవ్వుతూ కనిపించాడు మనసు హాయిగా అనిపించింది. అది మొదలు అలా రోజూ హాస్పిటల్ కి రావడం విష్ చేసి మెడిసిన్ తీసుకుని ఔట్ పేషెంట్ బ్లోక్ లోనుండి నన్ను చూసి కొద్దిసేపటికి వెళ్ళిపోవడం. ఒకరోజు ఉండలేక అడిగాను ఎందుకు ఇలా రోజు వస్తావు నీకు ఏం పనిలేదా అని కాస్తవిసుగ్గా.... దానికి చిరునవ్వు నవ్వి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని వెళ్ళిపోయాడు. ఎందుకో నేను అంత విసుగ్గా అడిగి ఉండవలసింది కాదు అనుకున్నాను మనసులో. ఆ తరువాత అతను కనిపించలేదు. రోజూ అతను కనపడతాడని నాకళ్ళు వెతికేవి కాని అతను ఇక ఎప్పటికీ కనపడని లోకానికి వెళ్ళిపోయాడని, అతనికి బ్రెయిన్ ట్యూమర్ వుందని కాస్త మతిస్తిమితం కూడా తప్పిందని తరువాత మా సీనియర్ స్టాఫ్ చెపితే తెలిసింది. మనసంతా భారమైంది.....
కొద్దిరోజుల తరువాత......ఒకరోజు కంప్లెండ్స్ బాక్స్ తెరచి చూస్తే అందులో నాకు అతను వ్రాసిన లేఖ కనపడింది, దాని సారాంశం నేను వాళ్ళ అక్కలా వుంటానని వాళ్ళక్కా బావా ఇతనికి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించ వలసివస్తుందో అని వదిలేసారని. వాళ్ళ అమ్మానాన్న మంచీర్యాల ట్రయిన్ ఆక్సిడెంట్ లో పోయారని. ఆ ఉత్తరం చదువుతుంటే నాకు తెలియకుండానే కళ్ళవెంట నీళ్ళు రాలాయి. నిన్న కాజీపేట్ పనిమీద వెళ్ళి వస్తుంటే నా పాత జ్ఞాపకాలు నన్ను తడిమాయి....
వాటిలో ఒకటి ఇలా మీముందు!!!
పాపం కదు. బంధాలు బంధాలు అని మనం గొప్పగా ఫీల్ అయ్యేవి అన్నిటీ నిజంవిలువ ధనం ముందు పెట్టి చూస్తే గాని అసలు రంగు బయట పడదు కదా.
ReplyDeleteప్రేరణా, ఇలాంటి సంఘటనలు కళ్ళముందు జరుగుతూంటే, అవి చూస్తు భరించటం చాలా కష్టం. ఇలాంటి విషాదాలు చూస్తూనే చాలా మంది విరక్తి చెందుతున్నారు. మానవ సంబంధాలు మెరుగు పడాలంటే ఏం చేయాలో.
ReplyDeletemmmmmmmmmmmmm papam!
ReplyDeleteఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మనసంతా బాధతో నిండిపోతుంది.
ReplyDeleteప్చ్ అయ్యో పాపం కదా:(
ReplyDeleteayyo paapam kadandi........
ReplyDeleteపిండేశారు... పద్మా గారు
ReplyDelete