Sunday, July 29, 2012

మట్టిబెడ్డలు

సంధ్యా సమయంలో ఒకవ్యక్తి అలా సముద్రపు ఒడ్డున నడుస్తూ కుప్పగా పడి దారికడ్డుగా ఉన్న పెద్ద పెద్ద మట్టిబెడ్డల్ని చూసి వాటిని తీసి ఒకోటి సముద్రంలోకి విసిరేస్తూ చివరికి నాలుగు మిగిలి ఉండగా....యాధాలాపంగా ఒక మట్టిబెడ్డని పగులగొట్టి చూసి ఆశ్చర్యంతో చకితుడైనాడు అందులో మెరుస్తున్న వజ్రాన్ని చూసి. మిగిలిన నాలుగూ పగులగొట్టి చూడగా అందులో కూడా వజ్రాలే మెరుస్తూ కనపడి ఇతడ్ని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించి....
అయ్యో అనవసరంగా మట్టిబెడ్డలు అనుకుని పైపైన చూసి అనవసరంగా వజ్రాలని సముద్రపాలు చేసాను కదా అని పశ్చాతాపడ్డాడు....


మనం కూడా అలాగే పైపై ఆకారాన్ని చూసి ఎందుకూ పనికిరారనుకుని నిర్లక్ష్యం చేస్తుంటాం వజ్రాలాంటి కొంతమంది వ్యక్తుల్ని. అలా కాకుండా చూసిన వెంటనే ఎవరిపైనా ఒక నిర్ధిష్టమైన అభిప్రాయానికి రాకుండా వారితో సాన్నిత్యంగా మెలిగి వారిలోని మంచిని గ్రహిస్తే వజ్రాలెన్నో మన చేయిజారిపోకుండా మనతోనే ఉండి మన విలువను మరింత పెంచుతాయేమో యోచిద్దాం.....ఏమంటారు!

19 comments:

  1. మీ మాటను తూ.చ.తప్పక పాటిస్తామండీ పద్మారాణి గారూ(ప్రేరణ):)

    ReplyDelete
    Replies
    1. ఇంతకి పొగిడారా లేక తిట్టారా కుమారవర్మగారు:)

      Delete
  2. చిన్న చిన్న కథలు భలే చెప్తారండి, మీరు.

    ReplyDelete
  3. ప్రేరణగారూ, చాలా మంచి విషయం చెప్పారు చాలా అందంగానూ చెప్పారు పాటించకుండా ఎలా ఉంటాము. మీ శైలి బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. ఫాతీమాగారు నచ్చినందుకు ధన్యవాధాలండి

      Delete
  4. ఆచరించవలసినవే కదా మీరు చెప్పేవన్నీ:-)

    ReplyDelete
  5. మట్టిలో మరుగుపడిన మాణిక్యాన్ని గుర్తించడం కష్టం గానీ,
    అసాధ్యం మాత్రం కాదు..
    మంచి పోస్ట్ ప్రేరణ గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మంచి పనులు కాస్త కష్టంగానే ఉంటాయికదండి.Thank you Srigaru.

      Delete
  6. చిన్న కధలో గొప్ప నిజం చెప్పారండీ...
    మనుషుల్ని పైపై ఆకారాన్ని బట్టి అంచనా వేసేస్తుంటారు..అది తప్పు అని చాలా బాగా వివరించారు..
    బాగుంది..

    ReplyDelete
    Replies
    1. సాయిగారూ థ్యాంక్సండి.

      Delete
  7. కథ బాగుంది.
    అలాగే బెడ్డ అన్న పదం విని చాలా కాలమైంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి. మీరన్నది నిజమేనండోయ్!

      Delete
  8. కొన్నిసార్లు ఇలా వెతకడంలో నకిలీవజ్రాలు కూడా దొరుకుతాయేమోనండి:)

    ReplyDelete
    Replies
    1. సాన్నిత్యంగా మెలిగి వారిలోని మంచిని గ్రహిస్తే....నకిలీ అన్న ప్రసక్తేరాదేమో అనికేత్:)

      Delete
  9. కథ బాగుందండి . మంచి విషయం చెప్పారు .

    ReplyDelete