Sunday, September 2, 2012

నమ్మకం

జ్ఞానం, ధనం, శక్తి, శ్రమ మరియు నమ్మకం అందరూ మంచిమిత్రులు.....
కలిసి ఆనందంగా ఉందామనుకున్నారు కానీ కాలం కలసిరాక విడిపోవలసి వచ్చింది....
ఎవరు ఎక్కడికి వెళ్ళి ఉండాలో అని చర్చించుకుంటూ.....
జ్ఞానం:- నేను విద్యాలయాల్లో, మందిరాల్లో, మసీదు, చర్చి, గురుద్వార్ లాంటి చోట్ల తలదాచుకుని నా దరిచేరిన వారికి నేను తగిన విధంగా దక్కుతానంది.
ధనం:- నేను మహల్లో, ఆస్తిపరుల ఖజానాల్లో దాకుంటానని చెప్పింది.
శక్తి:-ఆరోగ్యం మరియు సమతుల్యమైన ఆహారాన్ని నేను ఆశ్రయిస్తానన్నది.
శ్రమ:- సోమరితనంవీడి పట్టుదలతో సాధించాలని అనుకునే వారి దగ్గర వారాలు గడిపేస్తూ బ్రతుకుతానన్నది.
నమ్మకం మాత్రం మౌనంగా శూన్యంలోకి చూస్తుంటే జ్ఞానం మరియు ధనం అదేం నీవు ఎక్కడికి వెళతావో చెప్పవేం అనడిగిన దానికి ఒక ధీర్ఘశ్వాస తీసుకుని నిదానంగా ఇలా అన్నది........ "నేను ఒక్కసారి వెళ్ళిపోయానంటే ఇంక తిరిగిరాను".

12 comments:

  1. సరళంగా చక్కగా చెప్పారండి సెల్ఫ్ కాంఫిడెన్స్ ఉండాలని అది పోతే ఏం చేయలేమని.

    ReplyDelete
  2. pellante pandillu tappatlu taalalu moode mullu eday adugulu mottham kalipi noorellu aaaaa andukane annarandee

    ReplyDelete
  3. "నేను ఒక్కసారి వెళ్ళిపోయానంటే ఇంక తిరిగిరాను, very nice.

    ReplyDelete
  4. "నమ్మకం అనేది మడత లేని కాగితం లాంటిది...
    దాన్ని నలిపేస్తే...మళ్ళీ సరిచేయలేము"...
    నాకు నచ్చిన QUOTES లో ఒకటి...
    (తెలుగులోకి అనువదించి వ్రాసాను)
    మీ పోస్ట్ బాగుంది పద్మారాణి గారూ!
    సంక్షిప్తంగా,సూటిగా భావాన్ని చెప్తారు మీరు.
    అభినందనలు.
    @శ్రీ

    ReplyDelete
  5. నాకు నచ్చిందండి.

    ReplyDelete
  6. మీరు చెప్పేవిధానం చిన్నిపిల్లలకి అనునయించి చక్కగా చెపుతున్నట్లుగా ఉంటుందండి.

    ReplyDelete
  7. అది పోగొట్టుకునే సాహసం ఎవరూ చేయలేరు కదండీ...:-)
    అన్నీ వున్నా ఎదుటి వారిపై నమ్మకముంటేనే స్నేహమైనా, ప్రేమైనా మనసులో కలిగేది...
    మీ రాతలెప్పుడూ ప్రేరణ కలిగిస్తుంటాయి...

    ReplyDelete
  8. ప్రేరణ గారూ, మీరు చెప్పే విదానం నచ్చుతుంది నాకు.
    మంచి పోస్ట్....మెరాజ్.

    ReplyDelete
  9. మంచి మెసేజ్ ఇచ్చారండి?

    ReplyDelete
  10. ఎదుటివారి మీద అయిన ,మన మీద మనకైనా ఒక్క సారి నమ్మకం కోల్పోతే తిరిగి రావటం కష్టమేనండి.

    ReplyDelete
  11. చాలా బాగుంది పద్మ గారు :)
    అందుకే "trust takes years to build seconds to break and forever to repair" అంటారు

    ReplyDelete