Sunday, September 16, 2012

విజయానికై....

ఆఫీస్ లో  ఏపని మొదలెట్టినా నా ఫ్రెండ్స్ అంతా అలా రిస్క్ తీసుకుని చేయడమెందుకు నలుగురితోపాటు మనం కూడా గుంపులో గోవిందం అంతేకానీ ఇలా ఓవర్ గా వర్క్ చేసి నీవు సాధించే  మెడల్స్ ఏమున్నాయంటున్నారు, లైఫ్ బోర్ గా రొటీన్ గా ఉంది ఏదైనా గొప్ప సక్సెస్ సాధించాలంటే ఏంచేయాలని అడిగిన మా అమ్మాయికి చెప్పిన విషయం మీతో పంచుకుంటూ......
ఒక అనాధాశ్రమంలోని పిల్లలకు ఆటల పోటీల్లో రొటీన్ కి భిన్నంగా ఒక క్రొత్తరకమైన పోటీని పెట్టారు అందులో వివిధ రకాలైన  కూరగాయల్ని పండ్లని ఒకే ఆకారంలో కట్ చేసి వారి కళ్ళకిగంతలు కట్టి, చుట్టూ మిగిలిన పిల్లల కేరింతల మధ్య కనుగొనమని చెప్పారు. అయిదు నిముషాల వ్యవధిలో ఎవరెక్కువగా కనుక్కుంటే వారే విజేతలు. పోటీ మొదలు పెట్టగానే పిల్లలందరూ వారికి తోచిన విధంగా అరుస్తూ అది ఇదని, ఇది అదనీ అరుస్తుంటే పాల్గొన్నవారు కంగారులో చాలా తప్పులు చెప్పారు. కానీ ఒక చిన్నారి మాత్రం ప్రతి ముక్కని రుచి చూసి వాసనతో పసిగట్టి అత్యధిక కూరగాయల, పండ్ల పేర్లను చెప్పి ప్రధమ బహుమతిని కైవసం చేసుకుంది. ఆ చిన్నారిని చూస్తే ముద్దేసి నీ పేరేంటని అడిగితే పక్కనున్న ఇంకో అమ్మాయి  మేడం! ఈ అమ్మాయికి ఆక్సిడెంట్ అయి వినపడంలేదు అందుకనే మేము ఏం చెప్పినా వినకుండా తన సొంత ఆలోచనతో, తెలివితో ప్రైజ్ కొట్టేసిందని అమాయకంగా చెప్పి నా కళ్ళు తెరిపించింది.
ఇది మా అమ్మాయికి అర్థమై ఉంటే త్వరలో ఒక మంచి సక్సెస్ న్యూస్ తో మీ ముందుంటాను.

7 comments:

  1. చాలా చక్కగా రాశారండి, స్వతంత్ర ఆలోచన అనేది ఒకటుందనే సంగతి,చాలా మంది మరిచినట్లున్నారు.

    ReplyDelete
  2. Great advise to win in all aspects of life...you are a great Mom Prerana garu.. your daughter is very lucky baby too..with regards...:-)

    ReplyDelete
  3. వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
  4. చక్కని కథ ప్రేరణ గారు. మా పిల్లలకు చెపుతాను. థాంక్స్.

    ReplyDelete
  5. meeru internet lo choosay stories anni baaga pathavandee latest vi try cheyandee no offense

    ReplyDelete
    Replies
    1. stories ante ne chadivi, chusi, kalpinchevi inka andulo offense enti vichitram ga:)

      Delete
  6. మంచి పోస్ట్. స్పూర్తిదాయకమైన కధనం.

    ReplyDelete