Thursday, November 22, 2012

వద్దంటే

బహుశా అనుకూలవతి అయిన ఆలిని కానేమో
దురలవాట్లకి అతడ్ని దూరం చేయలేకపోయా!
ప్రొగతాగ వద్దంటే పొగరెక్కింది పోవే అన్నాడు
చుక్కేసి చేపల పులుసుకై చెంప పగులగొట్టాడు
సంపాదించడం చేతకాని నేను సంసారిని కానేమో
చిల్లిగవ్వైనా చేతికియ్యనోడికి చిల్లరదాన్నైపోయా!

9 comments:

  1. చాలా బాగుంది మీ కవిత చిత్రం కూడా...ఇంకొంచెం పొడిగించి వుంటే లేదా ముగింపు విధవరాలిగా మిగిలాలా వుంటే ఇంకా బుద్ధి వచ్చేది కదా అని..

    ReplyDelete
  2. Baagundi preranagaru meeru padda vedana.

    ReplyDelete
  3. అలా దురలవాట్లకి బానిసలైనవారు ఎందరు చూస్తారో ఈ పోస్ట్
    nice pic with inspiring post madam.


    ReplyDelete
  4. ఇంత సున్నితంగా చెపితే ఎక్కదేమోనండి వ్యసనాపరులకి...కటువుగా చెప్తేనే కాస్తైనా బుర్రకెక్కుతుందేమో!:-)

    ReplyDelete
  5. మీ బ్లాగ్ చూడముచ్చటగా ఉంది.

    ReplyDelete
  6. స్పందించిన అందరికీ ధన్యవాదములు.

    ReplyDelete