Friday, March 1, 2013

పోరాటం

నీకు కావలసిన ఆయుధాలని నీవే సిధ్ధం చేసుకో
జీవితరణంలో ఒంటరిగా పోరాడాలని తెలుసుకో
ఆడపిల్లవై పుట్టగానే నీ ఇంట పుట్టిన నిశ్శబ్దాన్ని
కొడుకును కోరుతూ నీ తండ్రి చేసే హత్యాకాండని
కట్నం కావాలి అంటూ కాల్చే నరరూప రాక్షసుల్ని
అమ్మకు పుట్టి ఆలిని కొడుకు కోసం వేధించేవాడిని
కాసులకై నిన్ను పలుమార్లు అమ్మే కామాంధుల్ని
వృత్తి, విద్యలకాడ వెకిలివేషాలు వేసే వెర్రివెధవలని
నీవు ఛండీ అవతారమెత్తి వీరిని చీల్చి చెండాడు...
సబలవైన నీకు సీతాసహనం అస్సలు పనికిరాదు!

No comments:

Post a Comment