ఓ! చిట్టితల్లీ త్వరగా ఎదగమాకు
నిన్ను రోజూ లాలించి పాలిస్తాను
పసిదానివైతే పొత్తిళ్ళలో దాస్తాను
బుజ్జగించిమరీ బువ్వతినిపిస్తాను
నీవడక్కుండా అన్నీ అందిస్తాను
కాని పెరిగిపెద్దై అందకుండాపోకు!
ఓ! కన్నా నీవో అమాయకురాలివి
విరిసీవిరియని ముద్దమందారానివి
నవ్వినవారిని నావారనుకునేదానివి
మోములో మదిని చదవలేనిదానివి
ఈ లోకం కుతంత్ర మాయాజాలవలకి
చిక్కక జారిపోవాలంటే ఎదిగిపోమాకు!
ఓ! బంగారుకొండా తళుకులతో మెరవకు
విద్యతో నీవే చెక్కుకో జ్ఞానపు నగిషీలను
త్రుంచేయి ఊగిసలాడే ఊహల మేడలను
నిబ్బరంతో నిర్మించు నిశ్చల గృహమును
ఎంతెదిగినా నాకు పసిదానివేనని మరువకు
ఎదగొద్దన్నానని ఎత్తుకెదిగి నీవు అలగమాకు!
నిన్ను రోజూ లాలించి పాలిస్తాను
పసిదానివైతే పొత్తిళ్ళలో దాస్తాను
బుజ్జగించిమరీ బువ్వతినిపిస్తాను
నీవడక్కుండా అన్నీ అందిస్తాను
కాని పెరిగిపెద్దై అందకుండాపోకు!
ఓ! కన్నా నీవో అమాయకురాలివి
విరిసీవిరియని ముద్దమందారానివి
నవ్వినవారిని నావారనుకునేదానివి
మోములో మదిని చదవలేనిదానివి
ఈ లోకం కుతంత్ర మాయాజాలవలకి
చిక్కక జారిపోవాలంటే ఎదిగిపోమాకు!
ఓ! బంగారుకొండా తళుకులతో మెరవకు
విద్యతో నీవే చెక్కుకో జ్ఞానపు నగిషీలను
త్రుంచేయి ఊగిసలాడే ఊహల మేడలను
నిబ్బరంతో నిర్మించు నిశ్చల గృహమును
ఎంతెదిగినా నాకు పసిదానివేనని మరువకు
ఎదగొద్దన్నానని ఎత్తుకెదిగి నీవు అలగమాకు!
అమ్మ హ్రుదయం కనిపిస్తుంది, కాల పరిస్థితులకు బయపడే అమ్మ మనస్సు మీ అక్షరాలలో కనిపిస్తుంది, చక్కటి కవిత. మై డియర్ ప్రేరణా..
ReplyDeleteమీ ప్రేరణ ప్రశంసనీయం సుమా !
ReplyDeleteఎదుగుతుంటే ఎంతగా ఒదగాల్సి వస్తుందో , అన్ని మెళకువలను ప్రతి తల్లీ బిడ్డకు చెప్పి తీరాలి అన్న నీ కవిత అంతర్భావన చాలా చాలా బాగుంది .
" ఎంతెదిగినా నాకు పసిదానివేనని మరువకు
ఎదగొద్దన్నానని ఎత్తుకెదిగి (ఆ పై) నీవు అలగమాకు! "
అన్నది ప్రతి తల్లి తలపులలో తలపిస్తుంటాయి .
మీ ప్రేరణ ప్రశంసనీయం సుమా !
ReplyDeleteఎదుగుతుంటే ఎంతగా ఒదగాల్సి వస్తుందో , అన్ని మెళకువలను ప్రతి తల్లీ బిడ్డకు చెప్పి తీరాలి అన్న నీ కవిత అంతర్భావన చాలా చాలా బాగుంది .
" ఎంతెదిగినా నాకు పసిదానివేనని మరువకు
ఎదగొద్దన్నానని ఎత్తుకెదిగి (ఆ పై) నీవు అలగమాకు! "
అన్నది ప్రతి తల్లి తలపులలో తలపిస్తుంటాయి .
మోములో మదిని చదవలేనిదానివి
ReplyDeleteఈ లోకం కుతంత్ర మాయాజాలవలకి
చిక్కక జారిపోవాలంటే ఎదిగిపోమాకు!
ఎదిగి వస్తున్న తనయ పట్ల అమితమైన ప్రేమ వాత్సల్యాలను కలగలిపిన తల్లి మనసును హృద్యంగా చిత్రంతో పాటు తెలిపినందుకు అభినందనలు ప్రేరణ గారూ.. కాసింత కళ్ళలో నీళ్ళు కూడా...
నిజంగా ఇది ప్రశంసనీయం ...అభినందనలు
ReplyDeleteఅమ్మ మనసుకు దర్పణం ఈ "ఎదగమాకు"
ReplyDeleteత్రుంచేయి ఊగిసలాడే ఊహల మేడలను
ReplyDeleteనిబ్బరంతో నిర్మించు నిశ్చల గృహమును
ఎంతెదిగినా నాకు పసిదానివేనని మరువకు
ఈ లైన్స్ మదిని తాకాయి.
ప్రేరణ ఇస్తున్న అందరికీ ధన్యవాదములు.
ReplyDelete