Sunday, September 1, 2013

!!తెలిసింది!!

అలనాడు అంటే విన్నాను
రాతిలోన దేవుడు ఉన్నాడని
నేడు కనులారా చూస్తున్నా
మనుషులే రాళ్ళై పోవడాన్ని!

తెలిసి గుడిలోకి ఏం వెళ్ళను
జనమే రాళ్ళుగా మారిపోతుంటే
మ్రొక్కుబడులు ఎన్నని తీర్చను
ఆశలెన్నో అంతులేని పుట్టలైనాక!
మంచే మన ఆభరణం అనుకుంటే
తెలిసె మిద్దెమేడలే కొలమానమని
అనురాగంగా అంతా నావారనుకుంటే
బంధాలు అవసరావకాశ తులాభారాలని
బంధుత్వాలు స్వార్ధపు సాలెగూళ్ళని తెలిసె!

3 comments:

 1. బంధుత్వాలు స్వార్ధపు సాలెగూళ్ళని తెలిసె!

  TRUE

  ReplyDelete
 2. చాలా చక్కగా వ్రాశావు . ఫైన్ , ఫైన్ .

  ReplyDelete
 3. నగ్న సత్యాలని తెలిపారు.

  ReplyDelete