Wednesday, September 4, 2013

!!భయం!!

కొందరు పగటి వెలుగులో తమనితాము చూసి భయపడితే
మరికొందరు చీకటిలో తమ నీడచూసి తామే భయపడతారు
నా ప్రత్యేకతని నిరూపించుకునే నెపముతో నిబ్బరంగా నిలచి
ప్రేమాభ్యర్ధనకి నేనే కరిగి తప్పు చేస్తానని భయపడుతున్నాను!

కొందరికి కలలు కంటూ హాయిగా బ్రతికేయడం అలవాటైతే
మరికొందరికి మత్తులో సర్వం మరచి జీవించడం అలవాటు
నాకునేనై అలవరుచుకోలేని అలవాట్లతో అతిగా కలవరపడి
శుభం పలకాలన్నా శృతితప్పి వణికే పెదవులతో భీతిల్లాను!

కొందరికి తలచినదే తడువు శ్రమపడకనే కోరినవి దక్కితే
మరికొందరికి శ్రమించినా ప్రతిఫలం దక్కదని తెలిసికూడా
నా అనుభవపు దొంతరలోదాగిన చిరుచేదు నిజాల నీడలో
వీడనిబంధాన్ని భూతద్దంలో విడిగాచూసి భూతమంటున్నాను!

9 comments:

  1. జీవితంలో భయం పనికిరాదు, చెడ్డ పనులు చేసేటపుడు తప్పించి :)

    ReplyDelete
  2. చాల బాగా రాసారు పద్మరణి గారు.

    జీవితాన్ని జీవం ఉన్న విలువలున్న ప్రాణం అనుకుంటే
    భయానికే వెన్నులో చలి పుట్టదా ?
    నిర్భయంగా ముందుకు సాగితే ఓటమే ఓడి విజయానికి దారినివ్వదా ?

    శ్రీధర్ భుక్య
    http://kaavyaanjali.blogspot.in/

    Kaavyaanjali: My Inspirations are my poems: A Tribute

    ReplyDelete
  3. ఎలాంటి బూతద్దానికీ బయపడాల్సిన పనిలేదు. ప్రేరణ గారు మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంతి. మీ కవిత చాలా బాగుంది, భావుకత ఉంది.

    ReplyDelete
  4. ఎందరికో ప్రేరణని ఇచ్చే మీరే భీతిల్లి, భయపడితే ఎలాగండి.

    ReplyDelete
  5. వీడనిబంధాన్ని భూతద్దంలో చూడకండి. భీతిల్లకండి కష్టేఫలె మాస్టారు మాటే నా మాట కూడా ..
    మీ బ్లాగ్ చాలా బావుంది . ప్లేయర్ లో పాట చాలా బావుంటుంది . నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట నైనా ప్రేరణగా తీసుకోవాలి .. కదా !

    ReplyDelete
  6. మనసులోని భయాందోళనకి ప్రతిరూపం మీ కవిత.

    ReplyDelete
  7. ప్రేరణ గారికి భయమా?? అందరి భయాలను పోగొట్టే మీరిలా అంటే మాకూ భయమేస్తోంది..

    అనుభవ జ్నానంతో అన్నింటిని అధిగమించేస్తారని ఆశిస్తూ..

    చిత్రంలో మీరేనా?

    ReplyDelete
  8. ప్రతి చరణంలో మొదటి రెండు వరుసలు పోలిక చాలా బాగుంది .
    ఆ తర్వాత ప్రతి చరణంలోని మిగిలిన రెండు వరుసలు " నా లోని లోపాలను వెలికి తట్టారు " .

    వీడని బంధాన్ని భూతద్దంలో చూడటం వల్లనే అది భూతమనుకోవటం జరిగింది . మామూలు అద్దంలో చూడటమే అన్ని విధాలా శ్రేయస్కరం .

    ReplyDelete
  9. అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete