Friday, November 15, 2013

!!పో పో!!

నా ఒంటరి ఉనికికి నీ అవసరం లేదు
నా విన్నపాన్ని విని దూరంగా వెళ్ళిపో

నా ప్రేమగాంచని నీవు ఇంకా ఎదగలేదు
నా నీడని కూడా తాకకుండా నన్నొదిలిపో

నా మనసు మంటలకి ఆజ్యంతో పనిలేదు
నాది అనుకుని నాదికాని ప్రతిక్షణం పారిపో

నా నమ్మకాన్ని వమ్ముచేసిన నిజం నాకొద్దు
నా అంతరంగంతో ఆడుకున్న విధీ దూరమైపో

నా మృత్యువుని ఏ బంధం అడ్డుపడి ఆపలేదు
నా ఆత్మా నీవు నాకందనంత ఎత్తుకి ఎదిగిపో!!

5 comments:

  1. నా నమ్మకాన్ని వమ్ముచేసిన నిజం నాకొద్దు
    నిజంగా 'నిజం' చెప్పారు....
    అప్పుడిక మార్గం మృత్యువేనేమో......

    ReplyDelete
  2. ఎదను బరువెక్కించే పదావాహిని.

    ReplyDelete
  3. నాది అనుకుని నాదికాని ప్రతిక్షణం పారిపో, బాగారాశారు

    ReplyDelete
  4. మీ దృఢ సంకల్పాల సందేశం బాగుందండి.

    ReplyDelete
  5. హృదయం మూగబోతుంది.
    చక్కటి పదవిన్యాసం.

    ReplyDelete