Friday, November 8, 2013

!!ముసలమ్మ!!

ఒక రంగువెలసి విరిగినగోడ
అదే అడ్డుగా గడిచిన బాల్యం


ఒక ఎండిన పొగడపూల చెట్టు
ఆ నీడలో ఎగిరిగెంతులేసిన గుర్తు


ఒక వడిలి రెక్కలు రాల్చిన పుష్పం
ఆ సువాసనాత్తరులే ఈ గుర్తింపులు


ఒక కాలు విరిగి కుంటుతున్న గుర్రం
అది నేర్పిందే జీవిత రేసులోని పరుగు


ఒక్కసారిగా కాక ఆగాగి వస్తున్న దగ్గు
ఆ దగ్గే వినిపించింది ఎన్నో జోలపాటలు


ఒకలయై వణుకుతున్న అలసిన శరీరం
ఆమే నేర్పింది అడుగులో అడుగేయడం


ఒకప్పుడు ఆమె దిద్దినవేకదా ఈ రూపులు
మరెందుకని ఆమెపైన ఇప్పుడింత నిర్లక్ష్యం

5 comments:

  1. అమృత మూర్తిని గుర్తుచేస్తున్న మీకు అక్షరనివాళి ప్రేరణగారూ.

    ReplyDelete
  2. Prerana gaaru.... Nijamgaa heart touching...:-):-)

    ReplyDelete
  3. గత జ్ఞాపకాలు అలలై ఎగిసాయి ప్రేరణగారు

    ReplyDelete
  4. మనసుకి హత్తుకునేలా రాస్తారు

    ReplyDelete