Saturday, December 21, 2013

!!ముసుగు!!

మనసుకేసిన ముసుగు తీసి మాట్లాడు
మమతలు అద్ది మనసువిప్పి మాట్లాడు

మాటలతో మభ్యపెట్టి మతలబు అడగకు
మనవారైతే మొహమాటానికి తావీయకు

మనసుకో స్నేహ ముసుగేసి చర్చించకు
కోరికకు కొత్తరంగులద్ది ప్రేమని మురవకు

ముసుగులో గుద్దులాటని గెలుపనుకోకు
మరోముసుగుతో ముంచి మంచనుకోకు

మనసు ముఖంపై ముసుగు తీసి చూడు
మంచిబాటలో మరోమెట్టు ఎదిగావుచూడు

5 comments:

  1. పద్మ రాణి గారు !

    మీ భావాలను ఎంతో కొంత అర్ధం చేసుకున్న నాకు
    ఈ 'ముసుగు' కాస్తా గందరగోళం చేసినట్లనిపించింది .
    ముసుగు వేసి మరీ మందలించారు . పాపం అభాగ్యుడో లేక
    అభాగ్యురాలో తెలీదు కానీ ...........
    మాటలతో మభ్యపెట్టిన ఏ వ్యక్తికీ కూడా ఆశించిన ఫలితం దక్కదేమో.
    ఆ మతలబు మాటెలా ఉన్నా ... మమకారాన్ని ప్రేమతో పొందాలి కాని
    మభ్య పెట్టినంత మాత్రాన అందుతుందా .

    మీ ఈ 'ముసుగు' కాస్తా భిన్నంతో పాటు ..... ఎక్కడో రవంత వైరాగ్యాన్ని
    చవిచూపింది .

    - శ్రీపాద

    ReplyDelete
  2. ముసుగుతీసి మాట్లాడాలి అంటే చాలా ధైర్యం కావాలండి.

    ReplyDelete
  3. మనసుకో స్నేహ ముసుగేసి చర్చించకు
    కోరికకు కొత్తరంగులద్ది ప్రేమని మురవకు
    మీరు మాత్రం ముసుగు తీసి రాశారు కవిత బాగుందండి.

    ReplyDelete
  4. ముసుగు మంచిదే కదండీ. ( ఒక్కోసారి )

    ReplyDelete
  5. ముసుగు తీసి మాట్లాడితే ముప్పు కదండీ ఒకోసారి

    ReplyDelete