Wednesday, December 25, 2013

!!తరాంతరాలు!!

వేరుదారుల్లో ఇద్దరిదొకటే గమ్యం...

నావేమో అనుభవసారాలు

నీవేమో నిండైన ఆలోచనలు

నావేమో గతించిన జ్ఞాపకాలు

నీవేమో చిగురిస్తున్న ఆశలు

నేను వేస్తున్నది పునాదిరాళ్ళు

నీవు వింటున్నవి మది అలజళ్ళు

నాదేమో నిలకడ నిశ్చల నిర్ణయం

నీదేమో వయసు నేర్పిన నిర్భయం

నాదైన అమ్మ ప్రేమలో "నిస్వార్థం"

నీదైన నిండు ప్రేమలో "నీ స్వార్థం"

ఇదేనేమో తరాంతరాల పరమార్థం!

4 comments:

 1. పద్మ గారూ !
  మీ మీ దారులు వేరు వేరైనా గమ్యస్థానం మాత్రం ఒకటిలాగానే
  తోస్తుంది మీరు మీ పాపను మలచిన తీరు చూస్తే .

  మీ అనుభవాలే ఆమెకు పాఠాలు. మీ జ్ఞాపకాల్లోంచే ఆమెకు ఆశలు
  చిగురించాయి . మీ నిర్ణయాల సఫలీకృత ఫలితాలే ఆమెలో ఓ నిండైన
  ఆత్మవిశ్వాసాన్ని నింపి - నిర్భయంగా ఉంటాననే నమ్మకాన్ని ఆమెలో ఇనుమడింప చేసాయి . మీ శ్వాసే ఆమెకు ఊపిరి .
  నవ్విస్తూ నిండుగా నవ్వే మీరు ఇంత మంచి భావనలు అందించినందుకు అభినందనలు -

  శ్రీపాద

  ReplyDelete
 2. తరాల మధ్యన అంతరాలు లేకపోతే ఇంక తేడా ఏముంటుంది చెప్పండి. దేనికైనా వాదోపవాదాలు, వ్యత్యాసం ఉంటేనే రక్తికడుతుందేమో :-) మీ భావాలు, ఆలోచనలు బాగున్నా ఒకోసారి మీతో వాధిస్తేనే విషయాలు తెలుస్తాయేమో అనిపిస్తుంది.

  ReplyDelete
 3. ఇద్దరి దారులు వేరైనా గమ్యం ఒకటే కదా....మంచిమిత్రులన్నమాట :-)

  ReplyDelete