Monday, December 16, 2013

!!నా అస్తిత్వాక్షరాలు!!

వ్రాయాలనుకుంటాను అందమైన రీతిలో
భావాలకి భాష, అక్షరాలు నేర్పాలని కాదు
ఆత్మతృప్తినిచ్చే అక్షరాలకి రూపమివ్వాలని

వ్రాయాలనుకుంటాను అద్భుతమైన శైలిలో
భాషపై అత్యంత పటుత్వము ఉన్నదని కాదు
భావవ్యక్తీకరణపై అక్షరాలకి వల్లమాలిన ప్రేమని

వ్రాయాలనుకుంటాను ఆలోచనలన్నీ కవితలో
భావుకతలకి కల్పనలు అద్దే కవయిత్రినని కాదు
పక్వపరిణితి చెందేలా మనసుకి పదును పెట్టాలని

వ్రాయాలనుకుంటాను ఆవేదనవంపి అక్షరమూసలో
భాంధవ్య బంధాలు భాధ్యతలు భాధించాయని కాదు
మదిని, మెదడుని ఒకేతాటిపై నడిపించేలా చేయాలని

వ్రాయాలనుకుంటాను అమూల్యాక్షరాలని పదమాలలో
భవసాగరంలో ఎదురీది గెలుపొందాలన్న స్వార్థం కాదు
నా అస్తిత్వానికి పునాదిగా అక్షరాలని అమర్చుకోవాలని

6 comments:

  1. చదవాలనుకున్నాను అక్షరాలను అందమైన పదవరుసలలో

    కానీ అస్తిత్వానికి పునాదిగా అక్షరాలని అమర్చుకోవాలని

    నా చిన్ని మనసుకు అర్ధమయ్యేలా రాసారు

    బాగుంది రాణి గారు .

    ReplyDelete
  2. అక్షరాలే మీ చెంత అందంగా అమరి కవితగా పరిమళిస్తాయి పద్మారాణి గారు. చాలా బాగుంది..
    మీ ఫోటో కవితకు అభినందన సుమాంజలులు..

    ReplyDelete
  3. అక్షర ముత్యాల మాల మమ్ము అలరించింది, మీరు రాయాలనుకున్నట్లే రాయండి అదే అందాన్నిస్తుంది,
    పద్మగారూ, కవిత బాగుంది.

    ReplyDelete
  4. వ్రాయాలనుకుంటాను ఏంటండి......అందమైన అక్షరాలని అలవోకగా పేర్చి మీ అస్తిత్వాన్ని ఉన్నతంగా చూపించారుగా. చాలా బాగుందండి ప్రేరణగారు

    ReplyDelete
  5. వ్రాయాలనుకుంటే వ్రాస్తూ వెళ్ళడమే! భావ వ్యక్తీకరణ నుండే భాష ఉద్భవించింది

    ReplyDelete
  6. ఈ కవిత మీ అంతర్గత భావాలకి దర్పణం ప్రేరణగారు. చాలా బాగుందండి

    ReplyDelete