వాస్తవాల్లోకి వంగిచూసి వంకర్లు వెతికేసి
వివేకిననుకుంటూ తలెగరేసి తర్కించడం...
ఆటవిడుపులైన అనుబంధాలు ముడివేసి
సాఫీగా సాగమంటే సాగేనా సహజీవనం...
నేలతాకేలా గాలిపటాన్ని క్రిందికి వ్రేలాడదీసి
ఉన్నతమైన ఆశలంటే అంటేనా అవి ఆకాశం...
ఎత్తుమడాల చెప్పులతో దర్పంగా అడుగులేసి
హుందా అనుకోవడం ఎంత వరకు సమంజసం...
చిన్నిగడ్డిపోచలంటి ధ్యేయాలని తాడుగా పెనవేసి
పైకి ఎగబ్రాకితే ఎన్నడూ కావు కన్నకలలు కైవశం...
ధృఢనిశ్చయానికి ధైర్యాన్ని జతచేసి ధ్యేయాన్ని చూసి
గురిపెట్టి శ్రమని సూటిగా సంధించడమే విజయసాధనం..

గురిపెట్టి శ్రమని సూటిగా సంధించడమే విజయసాధనం.......వాస్తవాన్ని చక్కగా వివరించారు పద్మా.
ReplyDeletePrerana gaaroo,guri chusi baagaa rasaaru.
ReplyDeleteచక్కటి వాస్తవం, చాలా బాగుంది.
ReplyDelete