Thursday, March 13, 2014

!!ఆశయం!!

ఆనంద ఆశలసౌధాల మధ్య నిర్మితమైన ఈ జీవనపయనంలో
నడుమ కాస్త సేదదీరబోయి విరామంలో విశ్రాంతిగా మండుతూ
నిన్ను నీవు ఓదార్చుకుంటూ భారం తగ్గించుకోబోయి పెంచుకోకు!

ఆలోచనల చితిలో అనవసరంగా కాలుతూ నీకు నువ్వే దూరమై
కన్నీటివాన కురిపించి నీ స్వప్నాలని నీవే భావాలతో బంధించేస్తూ
మౌన నిట్టూర్పుల మధ్య హృదయం దేదీప్యమై వెలగాలి అనుకోకు!

అర్థరాత్రి  కరిపోయే జ్ఞాపకాలకు విలువ కట్టుకుంటూ నిద్రలేమిలో
మరువలేని మరపురాని కోర్కెలకు కళ్ళెం విప్పి కొరడా ఝళిపేస్తూ
భాధలో భుజం కాకపోయినా వేదనలో నీ మది నీ తోడని మరువకు!

అనవసర క్షణాలని నిరీక్షణా కాలం అంటూ కార్యాలకి కాపలా పెట్టి
సరదాలకీ సభ్యతకీ నడుమ జరిగే భీకరపోరులో నిస్సహాయతంటూ
అలసట చెందిన గతానికి ఆలోచనల పందిరివేసి పైకి ఎగబ్రాకనీయకు!

6 comments:

  1. అద్భుతంగా చెప్పారు.....వేదనలో నీ మది నీ తోడని మరువకు! నిజమే కదా......every word is heart touching....

    ReplyDelete
  2. నిన్ను నీవు ఓదార్చుకుంటూ భారం తగ్గించుకోబోయి పెంచుకోకు!
    మౌన నిట్టూర్పుల మధ్య హృదయం దేదీప్యమై వెలగాలి అనుకోకు!
    భాధలో భుజం కాకపోయినా వేదనలో నీ మది నీ తోడని మరువకు!
    అలసట చెందిన గతానికి ఆలోచనల పందిరివేసి పైకి ఎగబ్రాకనీయకు!

    ఎంత బాగా చెప్పారో... అభినందన మందారాలు...

    ReplyDelete
  3. నిజం చెప్పారు ప్రేరణ గారూ . ఓదార్పు ఎప్పుడూ ఎదుటి వారి భాదలను , భారాన్ని తగ్గించడానికే ....
    అలా కాక వ్యధను పెంచు కోవడం ఎందుకు మరి. అయితే కొన్ని సంధర్భాల్లో .. అమాయకత్వమో లేక అనాలోచితమో తెలియనిస్థితిలో భారాన్ని పెంచుకుంటాము.
    అదేనేమో మానవ నైజం.
    ఇకపోతే నిట్టూర్పులు కలిగినప్పుడు మనసంతా శూన్యమౌతుంది కదా ...
    అంత తల్లడింపులో దానికి (హృదయం) వెలగాలని ఆశ ఉన్నా అప్పటి సందర్భం ఆ ఆశను అధిగ మిస్తుంది. వెలగలేదు పాపం. జీవితంలో పంచుకోగలవి .. పంచుకోలేనివి చెప్పి మనిషి మానసిక స్థితిని దిగజార నీయకుండా, ఆత్మాభిమానాన్ని ఇనుమడించేలా చెప్పారు. ధన్యులు మీరు ప్రేరణ గారూ . మంచి కవితనందించినందుకు అభి నందనలు.
    *** శ్రీపాద

    ReplyDelete
  4. జీవిత సత్యాలని జల్లెడపట్టేసి పిండేస్తారు

    ReplyDelete
  5. అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమేనండి

    ReplyDelete