Wednesday, May 7, 2014

!!ఓడిపోతున్నా!!

ఆశయసాధనకి ప్రణాలికలే ప్రాణమని..
నమ్మిన ప్రతిసారీ నేను ఓడిపోతున్నా!
అసంతృప్తిని మించిన పేదరికంలేదని..
సంతృప్తియే సిరులనుకుని సర్దుకున్నా!
ఆశను మించిన ఔషధం ఎక్కడుందని..
నిరాశల్ని నవ్వుతో చికిత్స చేసుకున్నా!
సరికాని సమస్యలని సమర్ధించలేనని..
సర్దుబాటంటూ కోరికల్ని అణుచుకున్నా!
పెంపకంతో ప్రేమపాశం పెనవేయలేనని..
ఊపిరైన బంధాలనే వదిలేసి జీవిస్తున్నా!
నమ్మకం ఆత్మస్థైర్యాలనే ఆయుధాలని..
ఎక్కుపెట్టి మరో జీవనసమరం చేస్తున్నా!

7 comments:

  1. పద్మా రాణి గారు...
    ధైర్యాన్ని కోల్పోయాము కవిత చదివి.
    ఆశాభావం తోనే మనిష తన భవితను రాగరంజితం చేసుకోవాలనే
    నమ్మకంతో ముందు కెల్తాడు. జీవితంలో మనమీద మనకు నమ్మకం
    పెంచు కోవాలే తప్ప.. వమ్ము చేసుకుంటే ఎలా ?
    ధైర్యానికి.. పిరికితనానికి తారతమ్యం ఓ తాత్పర్యంలా చెప్పడం
    అవసరం లేదేమో అని అనిపిస్తుంది .
    నిరీక్షణలో కూడా ప్రకాశవంత మైన, ప్రశాంతమైన ఘడియలు ఉంటాయని,
    వస్తాయని చూడ్డంలో అందం , అర్ధంవుంది అని చెప్పండి.

    నిర్లిప్తత .. నిరాశాలెందుకు ?

    మంచి ప్రభోదాన్ని అల్లారు మీ ఈ కవితలో పద్మా రాణి గారు.
    అయితే మీరు పెట్టిన మీ బొమ్మ కాస్తా ఎప్పటి నవ్వుని దూరం చేసుకుని ..
    మా పద్మారాణిలా కనిపిచక పోవడం కాస్త నిరాశగా అనిపించింది
    మీ ఈ కవిత చదివి .......
    మీ మనసు 'చివుక్కుమందని '
    అని అనుకుంటారేమో మీ అభిమానులు

    అలా కాదని..... ఇవన్నీ కలత చెందిన మనసుతో రాయలేదని ..
    జీవితంలో ధైర్యాన్ని ఏ పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకూడదని
    రాయండి ఇక్కడే "మరోమారు" మా కోసం . నిరాశ పరుచొద్దు.

    * శ్రీపాద

    ReplyDelete
  2. బాగుంది మీ కవిత

    ReplyDelete
  3. నిరాశకే ఊపిరిపోసినట్లుంది మీ కవిత

    ReplyDelete
  4. Never loss hope. Always you are the winner of your life.

    ReplyDelete
  5. ఈ నిరాశా నిస్పృహలు మీకో లెక్కా? అనుకున్నది సాధించడంలో మీరు ధిట్ట. మీకు ఈ నిరాశావాదం అస్సలు నప్పదు.

    ReplyDelete
  6. పేరుకు తగ్గట్లుగా ప్రేరణాత్మకంగా .... ఓడిపోతున్నా అంటూనే
    ప్రతి ఓటమిలోనూ ఒక పాఠముందని
    ప్రతి సర్ధుబాటు లోనూ ఒక సంతృప్తి ఉందని
    చిరునవ్వే ఔషధం అని
    నిబద్దతగా ఉండాలని నిర్దేశిస్తూ .... చాలా బాగుంది కవిత
    అభినందనలు కవయిత్రి గారికి

    ReplyDelete
  7. మీరు ఓడిపోవడం ఏంటి మేడం! ఓటమినే గెలిపించగల ధీమా చూసాం మీలో, మీరు మాకు ప్రేరణాస్ఫూర్తి......మనోధైర్యంతో సాగిపొండి.

    ReplyDelete