ఇంతలోనే ఈ మార్పు ఎందుకో!
వేలుపట్టుకుని నడిచిన చేతివేళ్ళే
వేలెత్తి వంకలు చూపుతున్నాయి
ఇంతలా తెలియని దూరమేలనో!
కరచాలం అంటూ కలిపిన చేతులే
కాదు పొమ్మని కసురుతున్నాయి
ఇప్పుడు ఎందుకని ఈ అలజడో!
నాడు అంతంలేని మాటల ఆతృతే
నేడు మాటలు వెతుకుతున్నాయి
ఇవాళ ఈ వ్యధభారమెలా తీరునో!
నాటి పరిచయ పులకరింతజల్లులే
పైనతడిసి పరాయిగా తోస్తున్నాయి
వేలుపట్టుకుని నడిచిన చేతివేళ్ళే
వేలెత్తి వంకలు చూపుతున్నాయి
ఇంతలా తెలియని దూరమేలనో!
కరచాలం అంటూ కలిపిన చేతులే
కాదు పొమ్మని కసురుతున్నాయి
ఇప్పుడు ఎందుకని ఈ అలజడో!
నాడు అంతంలేని మాటల ఆతృతే
నేడు మాటలు వెతుకుతున్నాయి
ఇవాళ ఈ వ్యధభారమెలా తీరునో!
నాటి పరిచయ పులకరింతజల్లులే
పైనతడిసి పరాయిగా తోస్తున్నాయి
ఇది దాదాపుగా చాలామంది యువతులు పైకి కనపడకుండా అంతర్లీనంగా పడ్తున్న , పడలేని స్థితి .
ReplyDeleteచక్కగా తెలియచెప్పారు .
కాకుంటే కొన్ని లైనుల్లో భావం రిపీట్ అయినట్లుగా కనిపించింది .
మార్పు తప్పదేమో కదండి.
ReplyDeleteChaalaa baagundi prerana gaaru..
ReplyDeleteమంచి కవిత
ReplyDelete