Friday, July 11, 2014

!!నవ్వుతూ బ్రతికేస్తాను!!

బ్రహ్మాండంగా బ్రతికేస్తాను.....నవ్వుతూ నవ్విస్తూ

తుప్పుపట్టిన ఊహలని ఆశలకొలిమిలో కాలుస్తూ

నలుగురూ నన్ను చూసి నవ్వితే నేను నవ్వేస్తూ!

అస్తమించే సూర్యుడిలో నన్ను నే చూసుకుంటూ

గూటికి చేరే పక్షులలో నన్ను నేను వెతుక్కుంటూ

చిరిగిన నవ్వుకి మాసికేసి నాలో నే నవ్వుకుంటూ!

కాగితంపువ్వుకి పలుసార్లు పరిమళమద్ది పీలుస్తూ

వలసలా వచ్చి పొమ్మంటూ జ్ఞాపకాలని తరిమేస్తూ

దర్జాగా బ్రతికేస్తాను...డాబుగా అని బేలగా నవ్వేస్తూ!

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. నవ్విన నలుగురినీ ఎద రగిలేట్లుగా ఎదిరికిస్తూ ...
    కొలిమి కాలి తుప్పొదిలిన ఊహలకు రెక్కలిస్తూ ...
    కాలం కలిగించిన మాసికలకు కనబడని కుట్లు వేస్తూ ...
    వలసలా వచ్చి పోయే జ్ఞాపకాలని తరిమేస్తూ ...

    యెంత చక్కగా రాశారు ఎద మెదిలిన భావాలను రంగరిస్తూ ...
    అందుకోండొక ఆశాభావం మీరుండాలని బ్రహ్మాండంగా, దర్జాగా బ్రతికేస్తూ ...
    మనసారా నవ్వేస్తూ ...
    జీవితాన్ని ప్రేమిస్తూ ...

    ReplyDelete
  3. మేడం గారు నవ్వుతూ నవ్విస్తూ మమ్మల్ని మాత్రం ఏడిపిస్తారు :-(

    ReplyDelete
  4. నవ్వుతూ బ్రతికేద్దాం మనమందరం.

    ReplyDelete