Monday, July 28, 2014

కలలు

స్వప్నాల్లో జీవించడమే బాగుంది
నిద్రని పెట్టుబడిగా పెడితేనే చాలని
కళ్ళతో ఆశల అంబరాన్ని తాకించి
నిదురే నాకు నిజమైన నేస్తమైంది

నెరవేరక నిరాశపరిచే నిజాలకన్నా
బూటకపు భ్రాంతియే భలేబాగుంది
అనురాగమంటూ ఆస్తులేం అడగక
ఊహల్ని వీలునామాగా అందించింది

అక్కునచేరి అవసరం తీర్చమననని
కావలసింది కనులార కలగనమంది
గతాన్ని కొనేంత గొప్పదాన్ని కాదని
గుర్తించి గుణపాఠమే నేర్చుకోమంది

8 comments:

  1. Prerana gaaru...chaalaa baagundi:):):)

    ReplyDelete
  2. సూపర్ గా ఉంది ప్రేరణగారు.
    http://ahmedchowdary.blogspot.com/

    ReplyDelete
  3. మంచి ఆలోచన...కలలు కంటూనే ఉండండి.

    ReplyDelete
  4. కలలుకనే భావాలు బహురమ్యం

    ReplyDelete
  5. చంద్రుని వెలుగులో నవ్వుతో మెరిసిపోతున్నారు

    ReplyDelete
  6. ఎప్పుడూ కలలు కంటూ నిదురపోతే సోమరి అంటారుకదండీ!

    ReplyDelete
  7. మనసుని హత్తుకుంది కవిత.

    ReplyDelete