Wednesday, August 13, 2014

నా ప్రేమ

ప్రేమని వ్యాపారంగా చూసి

లాభనష్టాలంటూ బేరీజు వేసి

మనసిచ్చిపుచ్చుకునే సంతలో

అమ్ముడుపోయే వాళ్ళు కోకొల్లలు

పో....పోయి అక్కడ కొనుక్కో ప్రేమని

నా ప్రేమని కొనే కాసులు కాదు కదా

ఖరీదు కట్టే కలేజా కూడా నీకు లేదు!

నా ప్రేమ రుసుముకి కాదు దక్కేది....

                                         నేను రుణమున్న వారికే అది చిక్కేది!!

2 comments:

  1. లెస్స పలికారు.

    ReplyDelete
  2. నా ప్రేమని కొనే కాసులు కాదు కదా
    ఖరీదు కట్టే కలేజా కూడా నీకు లేదు! chala baagarasaru

    ReplyDelete