Tuesday, August 5, 2014

తీరని ఋణం

మెల్లగసాగు జీవితమా ఋణాలు ఇంకా బాకీఉన్నాయి
అసలుకంటే ముందు వడ్డీ ఇమ్మని అడుగుతున్నాయి
హడావిడిగా సాగి కొన్ని తీరి మరిన్ని మిగిలి ఉన్నాయి

నెమ్మదిగానడు జీవితమా భాధ్యతలింకా మిగిలున్నాయి
భాధలే దించి బరువు తగ్గించమంటూ బంధాలు కోరాయి
అలుకలే తీర్చి ఏడ్చేవారిని నవ్వించమని అంటున్నాయి

కుదురుగా పయనించు జీవితమా పనులింకా ఉన్నాయి
తీరని కోరికలు ఇంకా బాకాయీలంటూ గోలచేస్తున్నాయి
విరిగి అతికిన మమతలు గాయం పూడ్చమంటున్నాయి

నడుస్తూ వెళ్ళు జీవితమా నీవెనుకే నా అడుగులుంటాయి
నా ఊపిరిపై హక్కు ఉన్నవారితో ఊసులాడాల్సి ఉన్నాయి
మెల్లగా సాగిపోవే జీవితమా ఆశలు ఇంకా మిగిలున్నాయి

6 comments:

  1. "వెన్నెలకెరటం" సాహిత్య బ్లాగుకు సభ్యత్వనమోదుకు ఆహ్వానం
    http://vennelakeratam.blogspot.in/p/blog-page_4312.html

    ReplyDelete
  2. మీరన్ని జీవిత సత్యాలని సరళమైన రీతిలో చెప్పేస్తుంటారు మేడ

    ReplyDelete
  3. మీ కవితలు చదువుతుంటే చెయకుండానే కళ్ళు చెమ్మగిల్లుతాయి. మనసుని మెలిపెడతారు మాటలతో.

    ReplyDelete
  4. కాలమా ఆగిపో అని కాకుండా నెమ్మదిగా సాగిపో అని సలహా ఇచ్చారు బాగుంది కానీ అన్నీ అప్పులూ బరువు బాధ్యతలే భారంగా ఉన్నాయి :-)

    ReplyDelete
  5. మెల్లగసాగు జీవితమా ఋణాలు ఇంకా బాకీఉన్నాయి
    అసలుకంటే ముందు వడ్డీ ఇమ్మని అడుగుతున్నాయి...touching lines

    ReplyDelete