Sunday, August 24, 2014

!!అందీఅందక!!

నింగిలోని జాబిలివై నాకు అందకుండా నీవుంటే
నీ రూపాన్ని గుండెల్లో దాచుకుని ఆనందిస్తున్నా.

అక్కడెక్కడో ఒయాసిస్సులా కనీకనబడక నీవుంటే
గుండెనిండా ఆశలను నింపుకుని నేను బ్రతికేస్తున్నా.

మదినిండా ప్రేమతో కురియని మేఘంలా నీవుంటే
నీ జ్ఞాపకాల సెగలతో ఆవిరైన ఆశలతో ఎదురుచూస్తున్నా.

సంతోషాల సెలఏరులా నీవు పొంగి ప్రవహిస్తుంటే
నిలువని నా ప్రేమతో ఆనకట్ట వేసి ఆపాలనుకుంటున్నా.

ప్రతిక్షణం నీవు లేవన్న లోటు నన్ను ఏడిపిస్తుంటే
మరచిపోవాలనుకుంటూనే మరల మరల నీ పేరే జపిస్తున్నా.

5 comments:

  1. ప్రేమికులు తమకు తెలియకుండా చేసే పని యిదే . బహు చక్కగా తెలియచెప్పారు ఈ వాక్యాల ద్వారా .

    ప్రతిక్షణం నీవు లేవన్న లోటు నన్ను ఏడిపిస్తుంటే
    మరచిపోవాలనుకుంటూనే మరల మరల నీ పేరే జపిస్తున్నా.

    ReplyDelete
  2. అక్కడెక్కడో ఒయాసిస్సులా కనీకనబడక నీవుంటే
    గుండెనిండా ఆశలను నింపుకుని నేను బ్రతికేస్తున్నా.
    భావం బాగుంది ప్రేరణగారు.

    ReplyDelete
  3. బాగుంది కవితాభావం

    ReplyDelete
  4. మనసు పాత్రలో ప్రేమ రసాన్ని నింపి దోసిలిలో ఒంపారు పద్మాజీ.. అభినందనలు..

    ReplyDelete
  5. ప్రేమమయి కవిత

    ReplyDelete