Monday, September 15, 2014

!!నా స్వార్థం నాది!!

దూరమైపోతున్నాయి అనుబంధాలు దగ్గర కాలేక...
నన్ను నేనే కోల్పోయా నా అన్నవాళ్ళని వెతికితే దొరక్క
లోకం అంటుంది నేను అందంగా నవ్వుతానని...
నేను మాత్రం అలసిపోతున్నా నవ్వులో భాధల్ని దాచలేక!
కన్నీటిని ప్రశ్నిస్తే నా నవ్వు సమాధానమిస్తుంది...
జీవితాన్ని అంతగా ప్రేమించి భాధపడకని...
జీవితాలన్నీ మృత్యువుతో బేరం కుదుర్చుకున్నాయని!

విధితో పోరాడుతూనే ఉన్నా నటించడం నాకురాక...
అది నన్ను గెలవనీయదు, నేను ఓటమిని ఒప్పుకోను
రోధించకనే నవ్వుతో భాధను మరువడం తెలుసు...
ఇది సాధ్యమా అనడిగి నవ్వుతూ నవ్విస్తున్న నన్ను చూసి!
బంధం ఏదో బిగిస్తున్నాను మన మధ్య అనుకోవద్దు
స్వార్థం నాది, నేను స్వార్థపరురాలిని అయిపోయా...
కాటికి మోసే ఆ నలుగురి సంఖ్యని పెంచుకుంటున్నానిలా!

6 comments:

  1. విధితో పోరాడుతూనే ఉన్నా నటించడం నాకురాక...
    అది నన్ను గెలవనీయదు, నేను ఓటమిని ఒప్పుకోను

    ReplyDelete
  2. కన్నీటిని ప్రశ్నిస్తే నా నవ్వు సమాధానమిస్తుంది...
    జీవితాన్ని అంతగా ప్రేమించి భాధపడకని...

    జీవితాలన్నీ మృత్యువుతో బేరం కుదుర్చుకున్నాయని!

    చక్కటి ప్రయోగమే , కానీ " జీవితాలన్నీ మృత్యువుతో బేరం కుదుర్చుకున్నాయని! "కంటే కుదుర్చుకున్నట్లున్నాయని అంటే బాగుండేందేమో .......

    విధితో పోరాడుతూనే ఉన్నా నటించడం నాకురాక...
    అది నన్ను గెలవనీయదు, నేను ఓటమిని ఒప్పుకోను

    ఎంత నిజాయితీ వుంది . చాలా చాలా బాగుంది .

    ReplyDelete
  3. మీ స్వార్థం మాకూ కాస్త పంచండి ప్రేరణగారు.

    ReplyDelete
  4. నటించడం నేర్చుకోండి...హాయిగా బ్రతికేస్తారు :-) కవిత చాలాబాగుందండి.

    ReplyDelete
  5. నటించొద్దు.. మీరు మీలానే నిలబడి గెలవాలి.. గెలుస్తారు.. మీ మాటెప్పుడూ మాకు ప్రేరణాత్మకం..

    ReplyDelete
  6. కాటికి మోసే ఆ నలుగురి సంఖ్యని పెంచుకుంటున్నానిలా!ఇంత స్వార్థమా

    ReplyDelete