Sunday, March 15, 2015

!!అద్దె దేహం!!

సొంతం కాని ఇల్లులాంటి శరీరాన్ని..
ఏదో ఒకరోజు వదిలి వెళ్ళవలసిందే కదా!
శ్వాసపీల్చడం పూర్తి అయితే ప్రాణాన్ని..
తనువు నుండి వేరు చేయవలసిందే కదా!
మరణం ఎన్నటికీ కోరదు లంచాన్ని..
కూడ బెట్టిన ఆస్తిని వీడవలసిందే కదా!
సంబర పడుతున్న సంతోషాలు అన్నీ..
సాంతం వీడి మట్టిలో కలవాల్సిందే కదా!
తిరుగు లేదని తలలు ఎగురవేస్తే ఏమీ..
తిరిగి వెళ్ళిపోతూ తలవాల్చాల్సిందే కదా!
రెండుచేతుల ఆర్జించి బీరువాలు నింపినా..
శవం పై కప్పే బట్టకు జేబులుండవు కదా!
మనతోటిదే లోకమనుకునే ఏ మనిషైనా..
కన్నుమూస్తే అద్దెదేహాన్ని వీడాల్సిందే కదా!
ఏడుస్తూ భూమి పై ఒకరు పుడుతుంటే..
వేరొకరు చచ్చి బూడిదై ఏడిపించడమే కదా!


5 comments:

  1. న్ని సత్యాలు చెప్పినా, వెంపర్లాట తప్పదు ప్రేరణగారు.

    ReplyDelete
  2. తెలిసినా జనన మరణ చక్రమాగదు.

    ReplyDelete
  3. "రెండుచేతుల ఆర్జించి బీరువాలు నింపినా..
    శవం పై కప్పే బట్టకు జేబులుండవు కదా!"
    అద్భుతహా :-)

    ReplyDelete
  4. శాస్వితం కాని దేహం పై అందరికీ మోజే. చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  5. good analysis,visit my blog to read about a poem on " death" ,http://ravisekharo.blogspot.in/2012/05/blog-post_26.html

    ReplyDelete