Saturday, April 11, 2015

!!జోస్యఫలం!!

నా అలవాట్లు నా పై అలుగుతుంటాయి
నా చేష్టలు నాతో చెలిమి కూడనంటాయి
నా ఇష్టాలు నన్ను వీడి వెళ్ళిపోయాయి
దురదృష్టం వలపంటూ నీడై వెంటాడుతూ
నా కోరికలతో కయ్యమంటూ కాలుదువ్వి
నా ప్రమేయం లేకుండానే భాధల్ని రువ్వి
నా కంట జారే నీరు చూసి విరగబడి నవ్వి
నుదుటిరాత మార్చలేమని జోస్యమే చెబితే
నాలోని పట్టుదలే విధిపై నన్ను ఉసిగొల్పింది
నా గమ్యం నాకు తోడై శ్రమని నమ్ముకోమంది
నా ప్రయత్న ఫలితమే నాకు జయం అయ్యింది!

4 comments:

  1. మన కష్టాన్ని మనమే నమ్ముకోవాలని చక్కగా చెప్పారు.

    ReplyDelete
  2. కష్టే ఫలే అన్నారు అందుకే

    ReplyDelete
  3. మంచి ప్రేరణతో వ్రాసారు.

    ReplyDelete