Monday, April 20, 2015

!!వ్యధలారా పొండి!!

ప్రియమైన వ్యధలారా నన్ను వదిలిపొండి 

ఆనందాన్ని ఇవ్వని మీరు నా దరిరాకండి

మనసు మమకారమంటూ లేనివి వల్లించి

మౌనరోధనకు మరో కొత్త భాషను నేర్పించి

మరల జీవితం పై చిగురాశను రేపకండి...

నన్ను చూసి భయపడే నా నీడనడగండి

వెలుగులో తోడొచ్చి చీకటిలో వీడెను ఏలని?

సంతోషాలని వెతికి వేసారిన నాపై ధూపమేసి

మసగబారిన మదిలో మమతని వెతక్కండి

జరిగినది మంచికేనని ఉత్తుత్తినే ఊరడించి

పక్షవాతపు జీవితాన్ని పరిగెత్తమని అనకండి!!!

4 comments:

  1. బాగుంది మీ వేదన దాని కవితారూపం

    ReplyDelete
  2. మసగబారిన మదిలో మమతని వెతక్కండి..చాలా నచ్చేసింది.

    ReplyDelete
  3. సంతోషాలని వెతికి వేసారిన నాపై ధూపమేసి
    మసగబారిన మదిలో మమతని వెతక్కండి..అద్భుతం!

    ReplyDelete