ఆకలితో ఎవరైనా చచ్చిపోతే అది హత్యే కదా
ఆ హత్యలకి కారణమైన వారికి దండనే లేదా
చట్టాలలోని వ్రాతలకు ఎన్నటికీ చలనం రాదా!
ఆ హత్యలకి కారణమైన వారికి దండనే లేదా
చట్టాలలోని వ్రాతలకు ఎన్నటికీ చలనం రాదా!
ఆకలితో అలమటించే వారికి న్యాయం జరగదా
మద్దతుకై జనాలని ఆకలి ఆత్మ పట్టి పీడించదా
ఉపన్యాసాలు ఇచ్చే నేతల గొంతు పిసికేయబోదా!
ఆకలితో ఎండిన ప్రేగుకి ఉపవాసమంటే తెలియదా
దిక్కుమాలిన దేశం ఎందుకని శాపనార్ధాలు పెట్టదా
ఉసురు తగిలిన పచ్చని పంటే బీడుగా మారిపోదా?

ఆకలితో ఎండిన ప్రేగుకి ఉపవాసమంటే తెలియదా..వీరికి తెలుసు, కడుపు నిండిన వారికే తెలియదు
ReplyDeleteమనదేశంలో ఆకలి చావులు అధికమే, బాగాచెప్పారు.
ReplyDelete