Wednesday, July 15, 2015

!!కలలు!!

కన్నుమూస్తే కళ్ళని దానమివ్వమన్నాను
కానీ బ్రతికుండగానే జీవితం అడుగుతుంది
నా కనులను కాదు నేను కన్న కలలను!!!

కలలను ఎన్నడూ కిరాయికి ఇవ్వొద్దంటాను
మనం కట్టుకున్న సౌధాన్ని కిరాయిదారుడు
అపురూపంగా చూసుకోలేడని తెలిసును!!!

సాగుతున్న సంతలో కలలనే వేలం వేసాను
కావలసినవి కమ్మని కలలై కౌగిలించుకుంటే
నిద్రలో మేల్కొన్న అదృష్టాన్ని చూసి నవ్వాను!!!

4 comments:

  1. కనే కలలని జీవితం అడగడం ఆర్దతగా ఉందండి.

    ReplyDelete
  2. కలలు కూడా ఇంత వ్యధను కురిపిస్తాయా

    ReplyDelete
  3. కలలకి కూడా కనికారం లేదన్నమాట. నైస్ మాడం

    ReplyDelete