ఉదయాన్నే లేవనంటూ మారాం చేయడం
హడావిడిగా తయారై బడికి పరుగుతీయడం
ఒకజడ రిబ్బను, షూబెల్ట్ ఊడి తిరిగిరావడం
ఇంటికి వచ్చీరాగానే ఆటలని పరుగులెట్టడం
ఆడుతూపాడుతూ పాఠాలు చదువుకోవడం
ఓ నా పాఠశాలా నన్ను మరోసారి చేర్చుకోవా!
హడావిడిగా తయారై బడికి పరుగుతీయడం
ఒకజడ రిబ్బను, షూబెల్ట్ ఊడి తిరిగిరావడం
ఇంటికి వచ్చీరాగానే ఆటలని పరుగులెట్టడం
ఆడుతూపాడుతూ పాఠాలు చదువుకోవడం
ఓ నా పాఠశాలా నన్ను మరోసారి చేర్చుకోవా!
ఆలస్యంగా వెళ్ళి ఆటస్థలం చుట్టూ ప్రదక్షణాలు
ప్రార్ధనా సమయంలో మాట్లాడి తీసిన గుంజీళ్ళు
కడుపునొప్పి అంటూ బడి ఎగ్గొట్టిన ఎన్నోరోజులు
పోటీ చదువులే కానీ పౌరుషాలకిపోని పరీక్షలు
అమాయకత్వంతో అంటుకున్న అనుబంధాలు
ఓ నా పాఠశాలా మరోమారు నన్ను రమ్మనవా!
నారింజ పిప్పర్మెంట్ బిళ్ళ తింటే ఎర్రబడిన నోరు
పుల్ల ఐస్ వల్ల జలుబుతో జ్వరం వస్తే నా పోరు
సర్కస్కి వెళ్ళి అందరంకలిసి చేసిన అల్లరిహోరు
తెలిసీ తెలియని వయస్సు అందరిలో ఏదో జోరు
అవి తలుచుకుంటే నేటి చదువులు యమబోరు
ఓ నా పాఠశాలా ఒక్కసారి నన్ను ఒడితీసుకోవా!

చిన్ననాటి మధురస్మృతులు చక్కగా చెప్పారు.
ReplyDeletesweet memories
ReplyDeleteబాల్యం గుర్తులు తేనెకన్నా తీయన
ReplyDeleteఅందమైన జ్ఞాపకాల దొంతర
ReplyDelete