Tuesday, October 13, 2015

!!తలపు!!

కొన్నిమాటలు తలపుకు వచ్చినప్పుడు
కన్నీటిచుక్కలు చెంపల్ని తడుముతూ
ఎవరో గుండెచలమల పై అడుగేసినట్లు
నిశ్శబ్ధంగా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది!

అద్దంలో నన్నునేను చూసుకున్నప్పుడు
రెండు పరావర్తన ప్రతిబింబాలు నవ్వుతూ
గడిచిన కాలమే గెంతులేస్తూ వచ్చినట్లు
మనసువిప్పి మాట్లాడినట్లు మరపిస్తుంది!


ఆలోచనల్లో అక్షరాలను వెతుకున్నప్పుడు
గుర్తులే గోళ్ళ చివర మొలచి మొరపెడుతూ
మూసిన కవనంలో తెరచిన జ్ఞాపకాలున్నట్లు
పట్టుకోబోతే దక్కిన ఆనందమే పారిపోతుంది!

4 comments:

  1. రెండు పరావర్తన ప్రతిబింబాలు నవ్వుతూ
    గడిచిన కాలమే గెంతులేస్తూ వచ్చినట్లు..adbhutam.

    ReplyDelete
  2. మనోభావాలు భావోద్వేగాల తలమానికలు.. స్వానుభవం రాణి మ్యాడం

    ReplyDelete