సమయపు శాఖల నుండి క్షణాల్ని తెంపి వేరుచేసినట్లు
సాంగత్యమే వీడిపోయెనని సంబంధాలు తెంచుకోలేము!
కంటి క్రింద చారికలు, మోము పై ముడతలు చెరిపివేసి
చిరిగిపోయిన చిత్రాన్ని అతికించి రంగులు వేయలేము!
రోజుకి ఇంతంటూ శ్రమించి ప్రోగుచేసి కూడబెట్టిన తేనెను
పోయే ప్రాణానికి ప్రాప్తం లేదని పంచి పండుగ చేయలేము!
సాగరంలో ములుగునని ఒడ్డున తెడ్డువేసి నావ నడిపినట్లు
ఆసరా ఇమ్మని పిల్లల ఆశయాలకి అడ్డుగా నిలవలేము!
సర్దుకుపోవడం సమయాలోచనని చేతకాని నీతులు చెప్పి
బంధాలతో కట్టివేస్తే, భారమైన బ్రతుక్కి భరోసా ఇవ్వలేము!

వేధించే సత్యాలు ఇవి
ReplyDelete