నవ్వుతూ చేతులు నులుముకుంటూ యోచిస్తున్నాను
సాఫీగా సాగలేక సాగుతున్న జీవితం పై అలిగిన నేను!!
నాకు నచ్చిన రీతిలో లోకం మారునని అనుకున్నాను
ఎండనక వాననక నిశ్చలంగా నిలబడి నిరీక్షణలో నేను!!
అంధకారంలో మునిగి మండుటెండలో మాడిపోతున్నాను
అయితేనేం కలలు అపురూపంగానే కంటున్నాను నేను!!
మున్ముందు ఇంకెన్ని భరించాలో అని భీతిల్లుతున్నాను
అలా అనుకుంటూ ప్రశ్నించుకుంటున్నాను నన్ను నేను!!
అడిగినవారికి చేతనైన సహాయమే చేసాను, చేస్తున్నాను
అవసరానికి వాడుకుని వదిలిన వారందరిలో ఒంటర్ని నేను!!
పలుకరించి పబ్బం గడుపుకున్న వారిచే మనసువిరిగెను
ముక్కలైతేనేం అద్దాన్ని అద్దంలాగే ప్రతిబింబిస్తాను నేను!!

చాలా అర్ద్రతగా రాస్తారు మీరు
ReplyDeleteఅంతరంగిక భావానికి అద్దం పట్టారు
ReplyDeletethank you
Deleteచాల బాగా రాసారు ...చాలా నిజాలు దొర్లుకొంటూ వెలుపలకు వచ్చేసాయి ...
ReplyDeleteమీరు రాసిన ఈ అనుభవం నా స్వీయ అనుభవం ...అవును ..పరకాయ ప్రవేశం చేసినట్టున్నది ...థాంక్స్ మాడం ...VIJAY.
thank you
Delete