Sunday, April 10, 2016

!!విచిత్రం!!

ఎంత చిత్ర విచిత్రమో కదా...
కళ్ళు ఊటబావి కాకపోయినా
బాధలో నీరు ఉబికి వస్తుంది.
శత్రుత్వం విత్తు కాకపోయినా
పగకి మదిలో బీజం వేస్తుంది.
పెదాలు వస్త్రం కాకపోయినా
మాటమీరితే కుట్లు వేయాల్సింది.
అదృష్టం ఆలి కాకపోయినా
అప్పుడప్పుడూ అలుగుతుంది.
జ్ఞానం లోహం కాకపోయినా
ఆలోచించకపోతే జంగు పడుతుంది.
ఆత్మగౌరవం శరీరం కాకపోయినా
గాయపడి వేదన చెందుతుంది.
మనిషి ఏ ఋతువు కాకపోయినా
అవసరాన్నిబట్టి మారిపోతుంటాడు!!

4 comments:

  1. కళ్ళు ఊటబావి కాకపోయినా బాధలో నీరు ఉబికి వస్తుంది :-(

    ReplyDelete
  2. ఎలా ఎందుకో మనిషి ??? చాలా బాగుంది ...తెలంగాణా 'జంగు ' సందర్భోచితంగా రాసారండి !!! జ్ఞానానికి జంగు " వాడుక పదాల మాల ....VIJAY

    ReplyDelete
  3. ఆత్మగౌరవం శరీరం కాకపోయినా
    గాయపడి వేదన చెందుతుంది..nice words madam

    ReplyDelete
  4. మనోభావాలను చాలా చక్కగా చెప్పారు పద్మరాణి మ్యాడమ్..

    కన్నీటి అర్దం తెలుసుకుని మసలుకుంటే బంధం గట్టిపడుతుంది..
    మనిషి మనసు తెలుసుకుంటే చల్లగా నీడై నిలిచే స్నేహపు వృక్షం ఎదిగి ఒదిగుంటుంది..
    పలికే మాటలు సిచువేషన్ కు అనుగుణంగా ఉంటే శ్రవణానందం..
    అలకల కులుకులతో బెట్టు చేసినా కాలానుగుణంగా బంధం విలువ తెలుసుకుంటే..

    ఆలోచనాత్మక కవిత

    ReplyDelete