Wednesday, April 13, 2016

!!నా తోడు!!

నా ఉనికిని తెలిపే అస్తిత్వపు అద్దం
ఎందుకో తెలియకుండా ముక్కలైపోయె
నలుగురిలో ఒంటరిగా నడుస్తుంటే
చుట్టూ లోకం ఎందుకో వింతగా తోచె
గాజువంటి మనసు ముక్కలై చెల్లాచెదురైతే
గుచ్చుకుంటాయన్న భయంతో తీయలేదు ఎవరూ..
నిజం చెబితే తెగిపోతాయి కొన్ని బంధాలు
అబద్ధమాడితే నాకు నేనే తెలియకుండా విరిగిపోతాను!
ఇది యాధృచికం అనుకో వ్యధతో కూడిన నిజమనుకో
కంటనీరిడిన ప్రతీసారీ నా అనుకున్నవారే కారణమై
ఈ జీవితం అంతులేని వింతకధగా అనిపించె
కోరుకున్నవి అన్నీ చేయి జారిపోయాయి..
జనాన్ని నవ్వించాలని నవ్వుతున్నానే తప్ప
లేకపోతే లోకాన్ని నీట ముంచేంత కన్నీరు నాలో దాగుంది!
ఆశ ఏదైనా ఉందంటే అది కేవలం నా కన్నీటి పైనే
అవి నేను బాధపడితే ఖచ్చితంగా మద్దతునిస్తాయి..

3 comments:

  1. మనసుని తడిపిన ఆర్ద్రమైన కవిత.

    ReplyDelete
  2. జీవాత్మ కి పరమాత్మ తోడు..
    జీవాత్మ కి జీవాత్మే నీడా..

    ReplyDelete
  3. గతించిన ప్రతీ క్షణాన్ని
    గుణించిన నిర్వేద భావం
    గడించిన పథం నిర్లిప్తమే ఔతుంటే

    శపించిన మనో గతాన్ని
    చలించని ఈ జీవితాన్ని
    జయించిన గుణం కనిపించని తీరుంటే

    కలకలమే చూసే నయనం ఏమంటుందో
    భపడుతూ జరిగే పయనం ఎటు పోతోందో
    మా రాబోయే సినిమా లోని ఒక చరణంలో అక్షరాలు ... మాడం , మీరు రాసిన కవిత ఒక స్తీ వ్యద ...చాల చక్కగా చెప్పారు ....విజయ్ ..

    ReplyDelete