Friday, May 6, 2016

!!నా నవ్వు!!

కొన్నిసార్లు నవ్వాలనుకుంటూనే కన్నీళ్ళు కారుస్తుంటాను
కొన్ని నీటిచుక్కలు కంట్లోమొలకెత్తి నన్ను వెక్కిరిస్తున్నట్లు
మరికొన్ని వద్దన్నా గుండెచలమల్లో చేరి నివాసముంటాయి!

కొన్నిసార్లు కన్నీళ్ళే నాకు కడుప్రియమైన భావాలనుకుంటాను
దరిచేరిన వాటిని ఆలింగనం చేసుకోవాలని ఆహ్వానించబోతూనే
మనసుగది గోడకి ధుఃఖపుధూళి మరింతగా వచ్చి అంటుతాయి!

కొన్నిసార్లు ఆలోచన్లు అనిశ్చితాలని సర్దుకోబోయి సంధి అంటాను
అదే అలుసై గాయాలన్నీ ఘనీభవించి సూదుల్లా పొడిచి దొలుస్తూ
రాత్రంతా జాగారముంచి పగలు ముఖంపై నల్లచారికలై నర్తిస్తాయి!

కొన్నిసార్లు అక్షరాలుగా మార్చి గుర్తులకి ఒకరూపు ఇవ్వబోతాను
బరువెక్కిన మనసు కవనమై తెరచిన జ్ఞాపకాలుగా పొంగిపొర్లుతూ 
నుదుటిపై ముడతలై నాట్యం చేయబోయి నివాసమౌతానంటాయి!

కొన్నిసార్లు కన్నీళ్ళు ఏమైనా కొత్తచుట్టాలాని తనివితీరా ఏడుస్తాను
అప్పుడు నాలో అంతర్లీనంగా దాగిన నా ఆత్మవిశ్వాసం నవ్వుతూ
వెర్రిదాన్నంటూ...నన్ను కాదని నా పెదవుల్ని తాకి విప్పారుస్తాయి!

7 comments:

  1. నవ్వుతో కన్నీటికి బదులు బహుచక్కగా ఇచ్చారు.

    ReplyDelete
  2. మీ నవ్వు మీకు రక్షణ.

    ReplyDelete
  3. అంతర్లీనంగా దాగిన ఆత్మవిశ్వాసం నవ్వుతూ...excellent words

    ReplyDelete
  4. అంతర్లీనంగా దాగిన నా ఆత్మవిశ్వాసం

    ReplyDelete
  5. మీ నవ్వే మీకు స్పూర్తి

    ReplyDelete
  6. హా హా హో హో
    మీ నవ్వే చాలు

    ReplyDelete