నవ్వుతూ నాలుగు
ముక్కలు చెప్పేసేయ్
కొన్ని మాటలు
నిన్నుకాదనుకుని నవ్వేసేయ్
అన్నిటికీ అనుకుని
ఆలోచిస్తే సమస్యలే చుట్టూ
లాక్కుని పీక్కుంటే
బుర్రలో గుజ్జుకే చెదలు పట్టు..
కొన్ని నిర్ణయాలు
నీవికావని కాలానికి వదిలేసేయ్
రేపెలా ఉంటుందో ఏమో
అనుకుని నేడు నవ్వేసేయ్
అప్పుడప్పుడూ సరదాగా
సర్దుకుని పోతుండూ
ఎందుకంటే కాయలున్న
చెట్టే ఒదిగిపోయి ఉండు..
నీకు నచ్చనివి
జరిగినా బయటపడక దాచేసేయ్
కొన్ని
నీవికావనుకుని బాధించినా అలగక నవ్వేసేయ్
తప్పులనుకుంటే అన్నీ
గుండెను కోసి గాయం చేస్తాయి
అనిశ్చల జీవితానికవి
అనవసరం అనుకుంటే హాయి..
మీ నవ్వుకు అర్ధం అదేనా మాడం ????
ReplyDeleteమీరు మీ వ్రాతలు ముత్యాల మూటలు.
ReplyDeleteమీ నవ్వు రహస్యం ఇదని తెలిపారు మాడం.
ReplyDeleteఇలాగే మాడంగారు అనుకుంటున్నది.
ReplyDelete