Saturday, May 14, 2016

!!సహజంగా!!

సముద్రమే సహజసిద్ధంగా సారాయి అయితే ఎంత బాగో..
కలలు అన్నీ నిజాలు అయితే అబ్బో ఎంత ఖుషీ ఖుషీనో!

ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవరి తరంలే..
అందరి గుండెలు పారదర్శకమై అగుపిస్తే అబ్బో ఆహా ఓహో!

మౌనానికే మాటరాక మనుషుల మధ్య సంధి అయినదేమో..
ముఖం ముందే ఉన్నది ఉన్నట్లు చెబితే ఎంత రచ్చ రచ్చనో!

ఎప్పుడూ మంచి చేసి చెడు అనిపించుకుంటాను ఎందుకో..
అదేదో సహజంగానే చెడ్డదాన్ని అయ్యుంటే ఎంత బాగుండేదో!

కాలం కలసి వస్తే చేసేది వక్రమైనా అందరికీ వింత విచిత్రమే..
పగబడితే ఆకు కూడా ఆయుధమై ఆయువే తీసేను తెలుసుకో!

1 comment:

  1. ఎప్పుడూ మంచి చేసి చెడు అనిపించుకుంటాను ఎందుకో..కాదు
    మీరే అనుకుంటే ఎలా చెప్పడి పద్మారాణీగారు

    ReplyDelete